Begin typing your search above and press return to search.

మొదటిసారి మెగా క్లిన్ కారా ఫేస్ రివీల్.. వ్వాటే సర్ ప్రైజ్

టాలీవుడ్ లో మెగా అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.

By:  Tupaki Desk   |   20 Jun 2026 5:36 PM IST
మొదటిసారి మెగా క్లిన్ కారా ఫేస్ రివీల్.. వ్వాటే సర్ ప్రైజ్
X

టాలీవుడ్ లో మెగా అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లిన్ కారా కొణిదెల ఫేస్ ను ఫస్ట్ టైమ్ అఫీషియల్ గా ప్రపంచానికి పరిచయం చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ క్యూట్ పాప ఫోటోలే వైరల్ అవుతున్నాయి. క్లిన్ కారా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా ఆమె ముఖం కనిపించకుండా చరణ్, ఉపాసన చాలా జాగ్రత్త పడ్డారు.

బయటకు వచ్చినప్పుడు కవర్ చేయడం, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా ఎమోజీలతో దాచేయడం లాంటివి చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు హింట్స్ ఇవ్వకుండా నేరుగా ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ ను షేర్ చేశారు. ఇందులో బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న క్లిన్ కారా చాలా క్యూట్ గా నవ్వుతూ అందరి మనసులు దోచేస్తోంది. నేడు జూన్ 20న క్లిన్ కారా తన మూడవ పుట్టినరోజు జరుపుకుంటోంది.

ఈ మూడేళ్ల బర్త్ డే సందర్భంగానే అభిమానుల కోసం ఈ సర్ప్రైజ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఉపాసన తన పోస్ట్ కు హ్యాపీ బర్త్ డే క్లిన్ కారా అవర్ ప్రెషియస్ లిటిల్ వన్ అంటూ ఎంతో ప్రేమగా ఒక క్యాప్షన్ కూడా జత చేశారు. ఇందులో చరణ్ కూడా తన కూతురిని చూసి ఎంతో మురిసిపోతున్న తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అసలు ఈ పాపకు పెట్టిన పేరుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉన్న సంగతి తెలిసిందే. లలితా సహస్రనామం నుంచి తీసుకున్న క్లిన్ కారా అనే పదానికి ఒక పవిత్రమైన దైవిక శక్తి అని అర్థం వస్తుంది. చాలా సంప్రదాయబద్ధంగా ఈ నామకరణ వేడుక నిర్వహించారు. ఇక తాతయ్య మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ చిన్నారిని ముద్దుగా లిటిల్ మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటారు.

రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుటుంబం మరింత పెద్దదైన విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ ఏడాది జనవరిలో వీరికి కవలలు జన్మించారు. అందులో బాబుకు శివరామ్ కొణిదెల అని, పాపకు అన్వీర దేవి కొణిదెల అని పేర్లు కూడా పెట్టారు. ఇద్దరు కొత్త పిల్లల రాకతో ఆనందంలో ఉన్న మెగా ఫ్యామిలీకి ఇప్పుడు క్లిన్ కారా బర్త్ డే వేడుకలు మరింత సంతోషాన్ని తీసుకొచ్చాయి. ఇక ఈ ఫస్ట్ ఫేస్ రివీల్ తో క్లిన్ కారాకు సోషల్ మీడియా అంతా బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. కాగా ఇటీవల రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన కిక్ లో ఉన్న అభిమానులకు ఇప్పుడు చరణ్ తన కూతురిని అఫీషియల్ గా చూపించడం డబుల్ ట్రీట్ లా మారింది.