Begin typing your search above and press return to search.

క్లీంకారకు తొలి సంక్రాంతి.. వేడుకలన్నీ అక్కడే..

టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువ ఇచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి.

By:  Tupaki Desk   |   13 Jan 2024 7:57 AM GMT
క్లీంకారకు తొలి సంక్రాంతి.. వేడుకలన్నీ అక్కడే..
X

టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువ ఇచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకుంటారు. ఇటీవలే క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మెగా ఫ్యామిలీ యంగ్‌ హీరోలతోపాటు కజిన్స్‌ అందరూ ఒక్కచోటకు చేరారు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ ఒకే ఫ్రేములో కనిపించి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు.


తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా కుటుంబసభ్యులు ఒక్క చోటకు చేరుతున్నారు. గతంలో బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సంక్రాంతి పండుగ జరుపుకున్న వీరంతా.. ఈ ఏడాది కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెంగళూరు బయలుదేరారు. సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. వీరికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరోవైపు, రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లీంకార కొణిదెలకు ఇదే తొలి సంక్రాంతి పండుగ. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్.. క్లీంకారకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా సంక్రాంతి వేడుకలను ప్లాన్ చేస్తున్నారట. గతేడాదికి మించి ఈసారి జరుపుకోనున్నారట. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఫొటోలు, వీడియోలు కోసం వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.


బెంగళూరులో జరిగే వేడుకల్లో చిరంజీవి- సురేఖ దంపతులు, నాగబాబు దంపతులు, న్యూ కపుల్ వరుణ్- లావణ్య త్రిపాఠి, అల్లు అర్జున్- స్నేహ రెడ్డి, సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ తదితరులు పాల్గొనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

కాగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కొత్త షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.