Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా హీరోల‌కు లైనేస్తున్నారు!

ఇంత‌కీ ఎవ‌రా భామ‌లు అంటే..? కియ‌రా అద్వాణీ- శ్రుతిహాస‌న్. కేజీఎఫ్ రాఖీభాయ్ య‌ష్ స‌ర‌స‌న ఈ భామ‌లు అవ‌కాశం అందుకున్నారు

By:  Tupaki Desk   |   22 March 2024 3:30 PM GMT
పాన్ ఇండియా హీరోల‌కు లైనేస్తున్నారు!
X

వ‌రుస‌గా పాన్ ఇండియ‌న్ హీరోల‌ స‌ర‌సన న‌టించేందుకు ఓ ఇద్ద‌రు భామ‌లు ఆస‌క్తిగా ఉన్నారు. అదృష్ఠ‌వ‌శాత్తూ ఈ ఇద్ద‌రికీ పాన్ ఇండియా ఆఫ‌ర్లే వెంట‌డుతున్నాయి. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒకే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నారు. అది కూడా కేజీఎఫ్ రాఖీభాయ్ య‌ష్ స‌ర‌స‌న న‌టిస్తూ వార్త‌ల్లోకి వ‌చ్చారు.

ఇంత‌కీ ఎవ‌రా భామ‌లు అంటే..? కియ‌రా అద్వాణీ- శ్రుతిహాస‌న్. కేజీఎఫ్ రాఖీభాయ్ య‌ష్ స‌ర‌స‌న ఈ భామ‌లు అవ‌కాశం అందుకున్నారు. య‌ష్ క‌థానాయ‌కుడిగా గీతూ మోహన్‌దాస్ తెర‌కెక్కించ‌నున్న 'టాక్సిక్' ఎట్ట‌కేల‌కు చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతోంది. నెలల తరబడి ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఉన్న ఈ సినిమా కోసం న‌టీన‌టుల ఎంపిక‌లు సాగుతున్నాయి. య‌ష్ స‌ర‌స‌న ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఊహాగానాలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఉత్కంఠ పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ విష‌య‌మై య‌ష్ అభిమానుల్లో అలాంటి క్యూరియాసిటీ ఉంది.

అయితే ఇప్పుడు క‌థానాయిక‌ల ఎంపిక విష‌యంలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అభిమానుల‌ను క‌న్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనిని అధికారికంగా ధృవీక‌రించేవ‌ర‌కూ న‌మ్మొద్ద‌ని క‌రీనా పీఆర్వోలు వెల్ల‌డించారు.

ఇప్పుడు కియారా అద్వాణీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' తర్వాత మరో సూపర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంది! అంటూ కియరా గురించి ప్ర‌చారం సాగుతోంది. యశ్‌ టాక్సిక్‌లో కియారా ఐటీ అమ్మాయిగా న‌టిస్తుంద‌ని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యానిమల్‌లో అతిధి పాత్ర తర్వాత త్రిప్తి డిమ్రీని యష్ స‌ర‌స‌న న‌టింపజేయాల‌ని ప్ర‌య‌త్నాలు సాగాయి. కానీ ట్రిప్తీ డిమ్రీ భూల్‌ భూలయ్యా 3లో కార్తీక్ ఆర్యన్ స‌ర‌స‌న‌ నటించడానికి ఓకే చెప్పింది. కార్తిక్ ఆర్య‌న్ 'భూల్ భూలయ్యా 2'లో కియ‌రా న‌టించ‌గా ఇప్పుడు ఆ అవ‌కాశాన్ని ట్రిప్తీ ద‌క్కించుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌రోవైపు శ్రుతిహాస‌న్ తో టాక్సిక్ బృందాలు చ‌ర్చ‌లు జ‌రిపాయి. శ్రుతి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల్ని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.