Begin typing your search above and press return to search.

మిరాయ్ తో పోటీ.. కిష్కింధపురి నిర్మాత ఏమన్నారంటే?

ఇప్పుడు మిరాయ్ తో పోటీ విషయంపై కిష్కింధపురి నిర్మాత.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. మీడియాతో ఇంటరాక్షన్ సమయంలో ఓ ప్రతినిధి.. మీ ప్రొడ్యూసర్లంతా ఐక్యంగా ఉన్నామంటారు.. గిల్డ్ అంటారు..

By:  Tupaki Desk   |   4 Sept 2025 12:33 AM IST
మిరాయ్ తో పోటీ.. కిష్కింధపురి నిర్మాత ఏమన్నారంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరికొద్ది రోజుల్లో కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి.. గ్రాండ్ గా సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కిష్కింధపురి.. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది. నిజానికి విడుదల తేదీని మేకర్స్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఒక రోజు పోస్ట్ పోన్ అవ్వనుందని ప్రచారం జరిగింది. కానీ అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 12నే విడుదల చేయనున్నారు.

అయితే అదే రోజు మరో యంగ్ హీరో తేజ సజ్జా మిరాయ్ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది. ఆ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుండగా.. రీసెంట్ గా 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో ఇప్పుడు ఆ రోజు బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి పోటీ పడనున్నాయి. రెండు మంచి అంచనాలతో ఉన్నాయి.

ఇప్పుడు మిరాయ్ తో పోటీ విషయంపై కిష్కింధపురి నిర్మాత.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. మీడియాతో ఇంటరాక్షన్ సమయంలో ఓ ప్రతినిధి.. మీ ప్రొడ్యూసర్లంతా ఐక్యంగా ఉన్నామంటారు.. గిల్డ్ అంటారు.. పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు.. కిష్కింధపురి రిలీజ్ డేట్ వచ్చినప్పుడు సోలో.. కానీ ఇప్పుడు వేరే సినిమాలు వస్తున్నాయి.. ఇప్పుడు మీ గిల్డ్ ఏం చేస్తున్నట్లు.. మీరేం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.

అప్పుడు సాహు గారపాటి.. తాము ఐక్యం కాబట్టే కలిసి వస్తున్నామని చెప్పగా అంతా నవ్వారు. అలా అయితే మిగతా డేట్లు ఖాళీ వదిలేస్తారా అని అడగ్గా.. అది నన్ను అడగకూడదు.. నేను ముందు డేట్ వేశాను.. నా మీద వచ్చిన వాళ్ళని అడగాలి.. నాకన్నా మీరు (మీడియా) అడగాలి.. నన్ను అడిగితే నేను చెబుతా.. అడగనప్పుడు ఏం చెబుతా అని సాహు గారపాటి అన్నారు.

అయితే ఇబ్బంది పడాల్సి మీరే కదా అని మీడియా ప్రతినిధి అనగా.. ఎందుకు? 12వ తేదీన తెలుస్తుంది? ఎవరు బాధపడతారనేది. ఇప్పుడెలా తెలుస్తుందని అన్నారు. దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిర్మాత కంటెంట్ పై ఫుల్ నమ్మకంతో ఉన్నట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.