Begin typing your search above and press return to search.

కిష్కింధపురి ప్రమోషన్స్‌లో కొత్త ప్రయోగం

టాలీవుడ్‌లో హారర్ సినిమాలు ఎప్పుడూ కూడా ఒక డిఫరెంట్ క్రేజ్ అందుకుంటూ ఉంటాయి. కొత్తదనం, థ్రిల్ కోరుకునే సమయంలో హారర్ జానర్ ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   3 Sept 2025 11:00 AM IST
కిష్కింధపురి ప్రమోషన్స్‌లో కొత్త ప్రయోగం
X

టాలీవుడ్‌లో హారర్ సినిమాలు ఎప్పుడూ కూడా ఒక డిఫరెంట్ క్రేజ్ అందుకుంటూ ఉంటాయి. కొత్తదనం, థ్రిల్ కోరుకునే సమయంలో హారర్ జానర్ ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఈ లైన్లోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న కిష్కింధపురి భారీ హైప్‌ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకోగా, ఇప్పుడు ప్రమోషన్స్‌కి యూనిక్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.

సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ప్యూర్ హారర్ ట్రీట్ ఇవ్వబోతోందని సినిమా యూనిట్ చెబుతోంది. విజువల్‌గా కొత్తదనం, మ్యూజికల్ థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెచ్చేలా డిజైన్ చేశారని ఇన్‌సైడ్ టాక్. ఇదే సమయానికి ప్రమోషన్స్ కోసం వేసిన సెట్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రతీ సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్స్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ ప్లాన్ చేస్తాయి. కానీ కిష్కింధపురి మేకర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ రూట్‌లో వెళ్లారు. హారర్ మూవీ కంటెంట్‌కి తగినట్లుగా ఓ స్పెషల్ సెట్ నిర్మించి అందులోనే వెబ్ మీడియా, యూట్యూబ్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆ సెట్‌లో భయానక వాతావరణం, హారర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం ద్వారా ఆడియన్స్‌కి డైరెక్ట్‌గా సినిమా వైబ్ ఫీల్ చేయించాలన్నది మేకర్స్ స్ట్రాటజీ.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ సెట్‌కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ కాకముందే, ప్రమోషన్స్‌లోనే హారర్ ఫీలింగ్ ఇచ్చేశారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా మార్కెటింగ్‌లో కొత్త పంథా ఎంచుకున్నప్పుడు ఆ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఎక్కువ. అదే రీతిలో కిష్కింధపురి టీమ్ ఈ సెట్‌తో పాజిటివ్ బజ్‌ని పెంచింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ కెమిస్ట్రీ, కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్, టెక్నికల్ టీమ్ విజువల్స్ కలిపి ఈ సినిమాకు మరో స్థాయి క్రేజ్ తెచ్చాయి. సినిమాలో ఏమి చూపించబోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్‌గా మారింది. మొత్తం మీద, కిష్కింధపురి ప్రమోషన్లలో తీసుకున్న కొత్త ఎక్స్‌పీరిమెంట్ హిట్ అయ్యింది. ఇక సెప్టెంబర్ 12న థియేటర్లలో అడుగుపెట్టబోతున్న ఈ సినిమా ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి.