'జూనియర్' పాస్ అయ్యాడు
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ సినిమాకు ప్రీ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరిగాయి.
By: Tupaki Desk | 20 July 2025 12:11 PM IST'జూనియర్' సినిమాతో ఒకేసారి కన్నడ, తెలుగు ప్రేక్షకుల ముందుకు కిరీటి రెడ్డి వచ్చాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ సినిమాకు ప్రీ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరిగాయి. అంతే కాకుండా సినిమా ట్రైలర్‌కి, పాటలకు మంచి రెస్పాన్స్ దక్కడంతో విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా సినిమాలోని వైరల్ వయ్యారి పాట మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో జూనియర్ సినిమా గురించి ప్రేక్షకులు చర్చించుకున్నారు. జూనియర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల హీరో కిరీటి రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో తెలుగు, కన్నడంలో కిరీటి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో కిరీటి రెడ్డి నటన గురించి కంటే డాన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే జూనియర్‌లోని వైరల్ వయ్యారి పాట సినిమా విడుదలైన తర్వాత మరింతగా చర్చనీయాంశం అయింది. వైరల్ వయ్యారి పాటలో కిరీటి, శ్రీలీల పోటీ పడి మరీ డాన్స్ చేశారు. శ్రీలీల అందం చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని అభిమానులు అంటూ ఉంటే, ఆమె డాన్స్‌ను ఇష్టపడే వారు గతంలో వచ్చిన డాన్స్ పాటలతో పోల్చితే ఈ వైరల్ వయ్యారి మరో లెవల్ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వైరల్ వయ్యారి పాటలో శ్రీలీల డాన్స్ గురించి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఓ రేంజ్‌లో ఉంది.
సాధారణంగా హీరోయిన్స్ బాగా డాన్స్ చేస్తే హీరోల పేరు ఎక్కువగా బయటకు రాదు. కానీ వైరల్ వయ్యారి పాటలో శ్రీలీల అద్భుతంగా డాన్స్ వేయడంతో పాటు హీరో కిరీటి డాన్స్ కూడా చాలా బాగుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్ మూమెంట్స్ తో కిరీటి చాలా మంది హీరోలను గుర్తు చేశాడంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కొత్త హీరోలు, యంగ్ హీరోలు డాన్స్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ జూనియర్ మాత్రం చాలా మంది స్టార్ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ వేసినట్లుగా అనిపించింది. కిరీటి వేసిన డాన్స్ ను చాలా మంది నెటిజన్స్ ఎన్టీఆర్ డాన్స్‌తో పోల్చుతూ ఉన్నారు.
కిరీటికి అభిమాన హీరో ఎన్టీఆర్ అనే విషయం తెల్సిందే. తన అభిమాన నటుడి డాన్స్‌తో తన డాన్స్‌ను పోల్చడం కంటే అదృష్టం ఏం ఉంటుందని అంటున్నారు. తాజాగా వైరల్ వయ్యారి పాటలోని హుక్ స్టెప్ ను ఎక్స్ ద్వారా షేర్ చేశాడు. ఆ స్టెప్ అంత ఈజీగా రాదు. అంతే కాకుండా శ్రీలీలతో వేసిన చాలా స్టెప్స్ పదుల టేక్ లు తీసుకుని, చాలా ఓపికతో చేసిన షాట్స్. అయినా కూడా ఎక్కడా అలస కనిపించకుండా పాట మొత్తం ఫుల్ ఎనర్జీతో శ్రీలీలతో పాటు కిరీటి కనిపించడం విశేషం.
జూనియర్ లో డాన్స్ తో కిరీటి పాస్ మార్కులు దక్కించుకున్నాడు. ముందు ముందు కిరీటి డాన్స్‌తో ఇండియాలోనే టాప్ రేంజ్‌కి వెళ్తాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఫలితంతో సంబంధం లేకుండా కిరీటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి, తెలుగులోనూ కిరీటి వరుస సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాడని తెలుస్తోంది.
