Begin typing your search above and press return to search.

వైరల్ వయ్యారి పాటతో ఫుల్ హైప్.. జూనియర్ మూవీకి అదిరే రెస్పాన్స్!

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయం అవుతున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Desk   |   11 July 2025 10:00 AM IST
వైరల్ వయ్యారి పాటతో ఫుల్ హైప్.. జూనియర్ మూవీకి అదిరే రెస్పాన్స్!
X

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయం అవుతున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంచి బజ్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కిరీటి.. ఇప్పటికే తన డాన్స్, లుక్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నాడు. టీజర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత రాజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. సాయికొర్రపాటి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం 18 జూలైన తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, సీనియర్ నటి జెనీలియా దేశ్‌ముఖ్ ఈ సినిమా ద్వారా సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ‘వైరల్ వయ్యారి’ అనే రెండో పాట సినిమాకు మరో లెవెల్ హైప్ తీసుకొచ్చింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ (1 కోటి వ్యూస్) దాటింది. పాటను డీఎస్‌పీ మరియు హరిప్రియ కలిసి పాడారు. పాప్ స్టైల్ బీట్, ట్రెండీ లిరిక్స్ ఈ పాటను యూత్ ఫుల్ హిట్‌గా నిలిపాయి.

అయితే ఈ పాటలో ముఖ్యంగా కిరీటి డాన్స్ హైలైట్‌గా మారింది. శ్రీలీల స్థాయికి తగ్గట్టు స్టెప్పులు వేయడం, ఎనర్జీ చూపించడం కొత్త హీరో కిరీటీకి కలిసొచ్చింది. శ్రీలీల గ్లామర్‌తోపాటు డాన్స్ పరంగా కూడా ఇరగదీసింది. వారిద్దరి కెమిస్ట్రీ పాటలో బాగా పండింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అంటే, ఈ పాటకు సంబంధించిన స్టెప్పులు సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ట్రెండ్ అవుతుండటమే.

పాట విజువల్స్, లొకేషన్స్, డాన్స్ మూమెంట్స్ అన్నీ కలిపి ఈ పాటను చార్ట్ బస్టర్‌గా నిలిపాయి. సినిమాటోగ్రఫీగా పని చేసిన కె.కె. సెంతిల్ కుమార్ అందించిన వర్క్, కలర్ గ్రేడింగ్ ఈ పాటకు అదనపు ఆకర్షణను జోడించాయి. ప్రస్తుతం ఈ పాటను యువత తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే, ‘జూనియర్’ మూవీ రిలీజ్‌కు ముందే అద్భుతమైన హైప్‌ను సంపాదించుకుంది. తొలి సినిమా కాబట్టి కిరీటి మీద ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, పాటల, టీజర్ ద్వారా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యాడు. ఇక జూలై 18న విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.