Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 లీక్‌ : మొదటి వికెట్ ఆమెనా?

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 7 మొదటి వారం రోజులు పూర్తి అయింది. ఈసారి సీజన్ కాస్త విభిన్నంగా ఉంటుందని ప్రచారం చేసినట్లుగానే కాస్త విభిన్నంగా సాగింది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 5:12 AM GMT
బిగ్ బాస్ 7 లీక్‌ : మొదటి వికెట్ ఆమెనా?
X

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 7 మొదటి వారం రోజులు పూర్తి అయింది. ఈసారి సీజన్ కాస్త విభిన్నంగా ఉంటుందని ప్రచారం చేసినట్లుగానే కాస్త విభిన్నంగా సాగింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్‌ 7 మొదటి ఎలిమినేషన్‌ కు సంబంధించిన ఎపిసోడ్‌ నేడు టెలికాస్ట్‌ అవ్వబోతుంది.

ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కి ముందే ఎవరు ఎలిమినేట్ అయ్యేది లీక్ అయింది. గత సీజన్లో కూడా ఇలా ముందు రోజు రాత్రి లేదా ఆ తర్వాత ఎలిమినేట్ అయింది ఎవరు అనేది లీక్ అయ్యేది. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. బిగ్ బాస్ హౌస్ నుండి మొదటి ఏడు రోజుల్లోనే ఒక కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవ్వడం ఎవరికైనా బాధను కలిగిస్తుంది. అలాంటి బాధ ఈసారి కిరణ్‌ రాథోడ్‌ ఎదుర్కోబోతుంది.

ఆమె భాష సమస్య అవ్వడంతో పాటు ఇతర కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులు ఆమె వైపు నిలిచిన దాఖలాలు కనిపించడం లేదు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్‌ 7 నుండి మొదటి వారం పూర్తి అయిన వెంటనే చాలా అంచనాలు పెట్టుకుని హౌస్‌ లో అడుగు పెట్టిన కిరణ్‌ రాథోడ్‌ ఔట్ అవ్వడం ఆమెకు మాత్రమే కాకుండా ఆమెను అభిమానించే వారికి షాకింగ్ గా మారింది.

మొదటి వీకెండ్‌ ఎపిసోడ్ ను నాగార్జున ఎప్పటిలాగే కాస్త డ్రామా తో నడిపించాడు. కొంత మంది కంటెస్టెంట్స్‌ ను మందలిస్తూ మరి కొంత మంది ఆటను అభినందిస్తూ నాగార్జున శనివారం ఎపిసోడ్‌ సాగించాడు. ఇక ఆదివారం ఎపిసోడ్‌ లో ఫన్ టాస్క్ లు ఇస్తూ కిరణ్ రాథోడ్‌ ఎలిమినేషన్‌ పక్రియ సాగించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇండస్ట్రీకి చెందిన కాస్త గుర్తింపు ఉన్న కంటెస్టెంట్స్ లో కిరణ్‌ రాథోడ్‌ ఒకరు. ఆమె కూడా ఎలిమినేట్ అయితే హౌస్‌ లో ఉన్న వారిలో ఒకరు ఇద్దరు తప్ప అంతా కూడా సీరియల్‌ ఆర్టిస్టులు, సోషల్‌ మీడియా సెలబ్రెటీలే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.