Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం బడా ప్రాజెక్ట్ ఆగిపోలేదు కదా..?

ఈమధ్య కాలంలో ఇలాంటి బడా ప్రొడక్షన్స్ లో చాలా తొందరగా అవకాశాలు అందుకున్న ఏకైక హీరో కిరణ్ అబ్బవరం.

By:  Tupaki Desk   |   2 April 2024 2:30 PM GMT
కిరణ్ అబ్బవరం బడా ప్రాజెక్ట్ ఆగిపోలేదు కదా..?
X

మొదటి సినిమాతోనే పక్కింటి కుర్రాడిలా కనిపించి యువతకు బాగా దగ్గరయ్యాడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణివారు అంటూ అతను సింపుల్ లవ్ స్టోరీ తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం , సమ్మతమే లాంటి సినిమాలు కూడా హీరోగా అతనికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. దీంతో గీత ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలలో అతనికి అవకాశాలు దక్కాయి.

ఈమధ్య కాలంలో ఇలాంటి బడా ప్రొడక్షన్స్ లో చాలా తొందరగా అవకాశాలు అందుకున్న ఏకైక హీరో కిరణ్ అబ్బవరం. అయితే పెద్ద సంస్థల్లో చేస్తున్న సినిమాలో విషయంలో కిరణ్ పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడం అతని మార్కెట్ పై ప్రభావం చూపించింది. నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.

అలాగే అంతకుముందు వచ్చిన సెబాస్టియన్ సినిమా కూడా కనీసం థియేటర్ రెంట్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. అప్పటివరకు ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన కిరణ్ మాస్ కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చేయడం వలన కూడా ఆ సినిమాలు ఇమేజ్ ని డామేజ్ చేశాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు కూడా దారితీసింది. ఇక అతని నుంచి చివరగా వచ్చిన రూల్స్ రంజాన్ సినిమా కూడా ఏమాత్రం క్లిక్ కాలేదు.

గత ఏడాది వరకు వరుసగా సినిమాలు చేసిన కిరణ్ హఠాత్తుగా బ్రేక్ తీసుకున్నాడు. రీసెంట్ గా తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరక్ తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం ఆ తరువాత దిల్ రూబా అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు కాస్త టైం పట్టేలా ఉంది.

అయితే గతంలో కిరణ్ ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ గ్రౌండ్ లో దాదాపు 30 కోట్ల భారీ బడ్జెట్ హనుమాన్ నిర్మంతా నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నట్లుగా కూడా టాక్ వినిపించింది. అయితే రూల్స్ రంజన్ తర్వాత కిరణ్ సైలెంట్ కావడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కూడా ఏవి బయటకు రాలేదు.

ప్రస్తుతం నిర్మాత నిరంజన్ రెడ్డి సాయి ధరమ్ తేజ్ అలాగే నితిన్ లాంటి హీరోలతో కాస్త కంటెంట్ ఉన్న గట్టి సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు. ఇక కిరణ్ అబ్బవరం ప్రాజెక్టు ఏమైంది అనే విషయంలో అధికారికంగా అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి భవిష్యత్తులో కిరణ్ అయినా ఆ ప్రాజెక్టు పై ఏదైనా వివరణ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే దిల్ రూబా సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న ఈ కుర్ర హీరో మరో రెండు ప్రాజెక్టులపై కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.