Begin typing your search above and press return to search.

పాజిటివ్ బజ్ తో రాబోతున్న 'రూల్స్ రంజన్‌'

కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   30 Sep 2023 8:54 AM GMT
పాజిటివ్ బజ్ తో రాబోతున్న రూల్స్ రంజన్‌
X

కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచి కూడా పాజిటివ్‌ బజ్ క్రియేట్ చేసింది అనడంలో సందేహం లేదు. హీరో కిరణ్ అబ్బవరం లుక్ తో పాటు హీరోయిన్ నేహా శెట్టి ల అప్పియరెన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

రతినం కృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వైభవంగా జరుగబోతుంది. సినిమా కి ఇప్పటికే భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు. నేడు జరుగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తో మరింతగా హైప్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విడుదలకు ఇంకా వారం ఉండగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వడం విశేషం. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్‌ ను జారీ చేయడం జరిగింది. ఈ సినిమాలో పలువురు కమెడియన్స్ తో పాటు ఎంతో మంది ప్రముఖ నటీ నటులు నటించడంతో ఫుల్‌ స్టార్‌ కాస్టింగ్ తో సినిమా కలర్‌ ఫుల్ గా కనిపించబోతుందట.

వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష, అజయ్‌, అభిమన్యు సింగ్‌, నెల్లూరు సుదర్శన్‌ వంటి వారు ఈ సినిమా తో సందడి చేయబోతున్నారు. నేహా శెట్టి డీజే టిల్లు తర్వాత రాధిక గా బాగా పాపులర్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాలోని పాత్ర తో నేహా శెట్టి గురించి జనాలు మాట్లాడుకోబోతున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.