Begin typing your search above and press return to search.

90 కోట్ల సక్సెస్ చూసిన దర్శకుడితో అబ్బవరం

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాల తర్వాత సాలిడ్ సబ్జెక్ట్ తో బేబీ మూవీని సాయి రాజేష్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 4:47 AM GMT
90 కోట్ల సక్సెస్ చూసిన దర్శకుడితో అబ్బవరం
X

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. అతని కెరియర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ అంటే వినరో భాగ్యము విష్ణు కథ. దీని తర్వాత ఈ ఏడాది మీటర్ అనే మూవీతో వచ్చి డిజాస్టర్ కొట్టారు. ప్రస్తుతం రూల్స్ రంజాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకునేలానే కనిపిస్తున్నాడు. కుర్ర హీరోలలో అందరికంటే వేగంగా జెట్ స్పీడ్ తో కిరణ్ అబ్బవరం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే 10వ సినిమాకి వచ్చేశాడు. రూల్స్ రంజాన్ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగానే మరో మూవీ షూటింగ్ దశలో ఉంది. కిరణ్ తో నిర్మాతలు కూడా 4 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

హీరో రెమ్యునరేషన్ తక్కువ తీసుకోవడంతో పాటు సినిమా ప్రమోషన్స్ ని గట్టిగానే చేస్తాడు. ఈ కారణంగా సినిమాపై పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఉంటాయని నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే అతనితో రిస్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజే దర్శకుడు కిరణ్ అబ్బవరంతో మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారంట. బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఏకంగా 90 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు సాయి రాజేష్.

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాల తర్వాత సాలిడ్ సబ్జెక్ట్ తో బేబీ మూవీని సాయి రాజేష్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి యూత్ ఫుల్ స్టోరీ లైన్ రెడీ చేసుకున్నారంట. కిరణ్ అబ్బవరంకి ఈ స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. త్వరలో ఈ సినిమాకి సంబందించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సాయి రాజేష్ బేబీ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటానని చెప్పారు. అయితే కథ సిద్ధంగా ఉండటం, కిరణ్ అబ్బవరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిర్మాత కూడా సిద్ధంగా ఉండటంతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.