Begin typing your search above and press return to search.

ఆమెతో కిరణ్ అబ్బవరం పెళ్లి.. అంతా అనుకున్నట్లే..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో డీసెంట్ హిట్స్ తో మంచి క్రేజ్ అందుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు.

By:  Tupaki Desk   |   11 March 2024 10:17 AM GMT
ఆమెతో కిరణ్ అబ్బవరం పెళ్లి.. అంతా అనుకున్నట్లే..
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో డీసెంట్ హిట్స్ తో మంచి క్రేజ్ అందుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. చాలా తొందరగానే అతనికి మైత్రి మూవీ మేకర్స్ గీత ఆర్ట్స్ లాంటి కాంపౌండ్ నుంచి అవకాశాలు వచ్చాయి. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ వెళ్లిన కిరణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గతంలో కొన్ని గాసిప్స్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.


అతను నటించిన హీరోయిన్ తోనే వివాహం జరగబోతోంది అని ఇప్పటికే పెద్దలతో మాట్లాడడం కూడా జరిగింది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు వచ్చాయి. అయితే మళ్లీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజంగానే ఈ యువ హీరో తను ప్రేమించిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె మరెవరో కాదు అతని మొట్టమొదటి హీరోయిన్ అని తెలుస్తోంది.


రాజావారు రాణి గారు సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అందులో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్ హీరో కిరణ్ అబ్బవరం మధ్యలో మంచి స్నేహభావం ఏర్పడింది. అనంతరం వారి స్నేహం ప్రేమగా మారినట్లుగా తెలుస్తోంది. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఒక విధంగా ఆ సినిమాకు సక్సెస్ లో మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచారు అని చెప్పవచ్చు.

ఇక ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు జంటగా కనిపిస్తూ ఉండడం విశేషం. కిరణ్ హీరోయిన్ రహస్య ఘోరక్ రాజా ఎంగేజ్మెంట్ ఈ నెల 13న జరిగనున్నట్ల తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రయివేట్ గా జరిగే ఈ వేడుకకు ఇండస్ట్రీలోని అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఈ జంట ఆగస్టులో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విదేశీ లొకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే రాజ వారు రాణి గారు సక్సెస్ తరువాత ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత సెబాస్టియన్ అనే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వెంటనే మళ్ళీ సమ్మతమే అనే సినిమాతో మరో డీసెంట్ సక్సెస్ చూశాడు. ఇక తర్వాత 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని', వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ లాంటి సినిమాలు చేశాడు. ఈ మధ్యనే రూల్స్ రంజాన్ అనే సినిమా కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలేవి కూడా అతనికి అంతగా సక్సెస్ ఇవ్వలేదు. కాస్త బ్రేక్ తీసుకున్న ఈ హీరో పెళ్లి తర్వాత మళ్ళీ తన కెరీర్ పై మరింత ఫోకస్ పెంచనున్నట్లు తెలుస్తోంది.