Begin typing your search above and press return to search.

హీరోయిన్​తో లవ్​.. అలా దొరికేసిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 8:57 AM GMT
హీరోయిన్​తో లవ్​.. అలా దొరికేసిన కిరణ్ అబ్బవరం
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ప్రేక్షకులను కంటిన్యూస్​గా అలరిస్తున్నారు. అయితే ఈ హీరో.. ఓ హీరోయిన్​తో ప్రేమలో మునిగిపోయారా అంటే.. నిజమే అని అర్థమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన... తన ప్రేమ గురించి పరోక్షంగా హింట్​ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే వివరాళ్లోకి వెళితే..

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం.. రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్​కు ఎంట్రీ ఇచ్చారు. ఇదే చిత్రంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రహస్య గోరఖ్‌. ఈ చిత్రం హీరోహీరోయిన్లుగా వీరిద్దరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే రాజావారు రాణిగారు షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారిందని బలంగా ప్రచారం సాగింది. సోషల్‌ మీడియాలో ఈ ఇద్దరిని ప్రేమ పక్షులు అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. కానీ వీరిద్దరు మాత్రం అస్సలు స్పందించలేదు.

ఆ మధ్య కిరణ్‌ ఓ వెకేషన్‌ ట్రిప్​కు వెళ్లి అక్కడ దిగిన ఫోటోలు షేర్‌ చేయగా.. మరోవైపు రహస్య కూడా అదే లొకేషన్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య సమ్​థింగ్ సమ్​థింగ్ నిజమేనని, ఇద్దరూ కలిసే షికారుకు వెళ్లారని అంతా అన్నారు. అనంతరం కిరణ్‌ గృహప్రవేశ వేడుకలోనూ ఈ ముద్దుగుమ్మ సందడి చేయడంతో ఆ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. అభిమానులు కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా మరోసారి దొరికిపోయారు కిరణ్‌ అబ్బవరం.

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ దావత్‌ అనే కొత్త షోను ప్రారంభించింది. ఈ షోకి కిరణ్‌ మొదటి గెస్టుగా వచ్చి సందడి చేశారు. అషురెడ్డి హోస్ట్​గా వ్యవహరించింది. ఇద్దరు కలిసి పలు ఆసక్తికర విషయాలను మాట్లాడుకుని నవ్వించారు. అయితే అషురెడ్డి.. రహస్య గోరఖ్‌ - మీరు రిలేషన్‌లో ఉన్నారా? అని అడిగేసింది.

అలాంటిదేమీ లేదని, అలాంటిదేమైనా ఉంటే చెప్తామని బదులిచ్చాడు కిరణ్ అబ్బవరం. చెప్తాము అంటున్నారంటే ఇద్దరూ కలిసి ఒకేసారి పెళ్లి డేట్‌ ఎప్పుడో చెప్తారా? అని మళ్లీ అషురెడ్డి నవ్వించింది. దీంతో కిరణ్ సిగ్గుపడిపోయాడు. నేను ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలలో కూడా ఎప్పుడూ ఇంతలా దొరికిపోలేదు అని చెప్పుకొచ్చారు. దొరికిపోయాను అంటున్నారంటే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లేనని అంతా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. దీనికి సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ వీడియో త్వరలోనే రానుంది.