Begin typing your search above and press return to search.

సొంతూరులో హీరో సొంతిల్లు గృహ‌ప్ర‌వేశం!

కొత్త‌గా ఇండ‌స్ట్రీకొచ్చి స‌క్సెస్ అయిన త‌ర్వాత ఆ యంగ్ హీరో ఏం చేస్తాడు. సిటీలో ఖ‌రీదైన ప్రైమ్ ఏరియాలో మంచి విల్లానో..డూప్లెక్స్ ఇల్లు కొంటాడు

By:  Tupaki Desk   |   28 Sep 2023 12:30 PM GMT
సొంతూరులో హీరో సొంతిల్లు గృహ‌ప్ర‌వేశం!
X

కొత్త‌గా ఇండ‌స్ట్రీకొచ్చి స‌క్సెస్ అయిన త‌ర్వాత ఆ యంగ్ హీరో ఏం చేస్తాడు. సిటీలో ఖ‌రీదైన ప్రైమ్ ఏరియాలో మంచి విల్లానో..డూప్లెక్స్ ఇల్లు కొంటాడు. కుటుంబాన్ని అక్క‌డి షిప్ట్ చేస్తాడు. అటుపై సిటీలో తిర‌గ‌డానికి ఖ‌రీదైన బ్రాండెడ్ కార్లు కొంటాడు. రేంజ్ మారుతుంది కాబ‌ట్టి సెల‌బ్రిటీ హోదా అనేది ఒక‌టి మెయింటెన్ చేయాలి కాబ‌ట్టి ఇలాంటి ప్లానింగ్ ఉంటుంది. ఆ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ ఇదే ప్లానింగ్ తో ముందుకెళ్లి ఓ పెద్ద బంగళా క‌ట్టాడు.

ఆ ఇంటిని త‌ల్లిదండ్రుల‌తో గృహ ప్ర‌వేశం చేయించాడు. దీంతో ఆ త‌ల్లిదండ్రుల ఆనందానికి అవ‌దుల్లేవ్. కొడుకు ఎదిగాడు అన‌డానికి ఇంత‌క‌న్నా సాక్ష్యాలు ఏం కావాలి. తాజాగా మ‌రో యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం కూడా సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. కానీ కిర‌ణ్ ఇల్లు నిర్మించింది హైద‌రాబాద్ లోనే కాదు. తాను పుట్టి పెరిగిన సొంతూరు రాయ‌చోటిలో. అక్క‌డ సొంతిల్లు నిర్మించాడు. తాజాగా గృహ‌ప్ర‌వేశానికి సంబంధించిన వీడియోన్ ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌డంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఇది చూసిన అభిమానులు కిర‌ణ్ కి విషెస్ తెలియ‌జేస్తున్నారు. సొంతూరు అంటే కిర‌ణ్ కి ఎంత ఇష్ట‌మో అక్క‌డే ఇల్లు నిర్మించ‌డంతోనే అర్ధ‌మ‌వుతుంద‌ని నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. హీరో అయ్యాడ‌ని అంద‌రిలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లోనో..బంజ‌రా హిల్స్ లోనే కాకుండా పుట్టి పెరిగిన ఊళ్లో ఇల్లు క‌ట్ట‌డం చాలా మంది అభిమానుల‌కు న‌చ్చింది. ఇప్పుడున్న కొత్త ఇంటి స్థ‌లంలో ఓ పాత ఇల్లు ఉండేది.

ఆ ఇంటిని కూల‌గొట్టి కిర‌ణ్ స్టార్ అయిన త‌ర్వాత డ‌బ్బులు పొగేసి క‌ట్టిన ఇల్లులా క‌నిపిస్తుంది. ఇల్లు క‌ట్టేసాడు. ఇక పెళ్లి చేసుకోవ‌డం ఉంది. ఆ కార్యం కూడా కానిచ్చేస్తే లైఫ్ పుల్ ఫిల్ అవుతుంది. ఇక కిర‌ణ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. న‌టుడు అవ్వ‌డం కోసం కిర‌ణ్ కూడా చాలా క‌ష్టాలే ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో 'రూల్స్ రంజ‌న్' అనే సినిమాలో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లో ఆ సినిమా రిలీజ్ కానుంది.