బేబీ బంప్ తో మెరిసిపోతున్న రహస్య అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 8:20 AMటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా చేస్తున్నప్పుడే కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరఖ్ ను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లోని అందమైన జంటల్లో కిరణ్ అబ్బవరం- రహస్య జోడీ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి రాజావారు రాణి గారు అనే సినిమా చేశారు.
ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కిరణ్- రహస్య ఇప్పుడు రహస్య సీమంతం ఫోటోలను నెట్టింట షేర్ చేశారు. తాజాగా రహస్య సీమంతం వేడుక ఘనంగా జరగ్గా, ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను రహస్య తన ఇన్‌స్టాగ్రమ్ లో షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో రహస్య బేబీ బంప్ తో మరింత అందంగా ఉంది. బేబీ బంప్ తో రహస్య, కిరణ్ జంట ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి రహస్య, కిరణ్ అబ్బవరం దంపతులకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు.
రాజా వారు రాణి గారు సినిమా కోసం కలిసి పని చేసిన వీరిద్దరూ ఆ సినిమా టైమ్ లోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటూ ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. పెళ్లి తర్వాత రహస్య సినిమాలకు దూరంగా ఉండగా, కిరణ్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రహస్యను పెళ్లి చేసుకున్న తర్వాతే కిరణ్ అబ్బవరం క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.