శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
యువ నటుడు కిరణ్ అబ్బవరం భార్య, అతడి తొలిచిత్ర కథానాయిక రహస్య గోరక్ ఇటీవలే తన బేబీ బంప్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 May 2025 12:06 AM ISTయువ నటుడు కిరణ్ అబ్బవరం భార్య, అతడి తొలిచిత్ర కథానాయిక రహస్య గోరక్ ఇటీవలే తన బేబీ బంప్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రహస్య కిరణ్ బేబిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. ఈ సంవత్సరం జనవరిలో ఈ జంట గర్భధారణ విషయాన్ని ప్రకటించారు.
ఇప్పుడు రహస్య పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభసందర్భాన తండ్రిగా కిరణ్ ఆనందానికి అవధుల్లేవ్. అతడు తన బిడ్డ పాదాలను తన్మయంగా ముద్దాడుతూ కనిపించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. ఇది కిరణ్ కి ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్.
కిరణ్ వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎంతో హ్యాపీ హీరో. చాలా మంది అగ్ర హీరోలకు దక్కని వరం కిరణ్ కి లభించింది. ఈ ఉత్సాహంలో అతడు తన తదుపరి సినిమాలను వేగవంతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కిరణ్ - రహస్య మధ్య లవ్ `రాజా వారు రాణి గారు` (2019) సెట్స్‌లో ప్రారంభమైంది. ఐదు సంవత్సరాలకు పైగా సంబంధంలో ఉన్న తర్వాత, వారు ఆగస్టు 2024లో వివాహం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం నటించిన దిల్రుబా మార్చి 2024లో విడుదలైంది. తదుపరి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ K రాంప్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
