కిరణ్ అబ్బవరం 'కె- ర్యాంప్'.. గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా క మూవీతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 July 2025 5:11 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా క మూవీతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దిల్ రుబాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో కె- ర్యాంప్ కూడా ఒకటి. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కిరణ్, చేతన్ కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి.
గతంలో ఎస్ ఆర్ కళ్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు రాగా.. ఇప్పుడు కె- ర్యాంప్ రానుంది. ఇప్పటికే మేకర్స్ ఆ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ లో జోష్ నింపింది. ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్ తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
రేపు (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ గా.. గ్లింప్స్ ను విడుదల చేశారు. పూర్తి మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మొత్తం ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో కట్ చేసి మెప్పించారు. సినిమాలో పక్కా ఊర నాటు రోల్ లో కిరణ్ అబ్బవరం నటిస్తున్నట్లు రివీల్ చేశారు.
ఈసారి ఒక్కొక్కరికి బుర్ర పాడు అంటూ కిరణ్ చెప్పిన బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కారు నుంచి కిరణ్ దిగగా.. రిచెస్ట్ చిల్లర గయ్ అంటూ మేకర్స్ పరిచయం చేశారు. అనంతరం కొన్ని ఫన్నీ సీన్స్ ను చూపించిన మేకర్స్.. బార్ లో క్రేజీగా బాటిల్ తో మందు పోసుకుని తాగుతూ హీరో కనిపించారు.
ఏఎంబీ సినిమాస్ లో మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం.. కానీ తెలుగు ప్రేమ కథతో ప్రాబ్లం అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే డైలాగ్ తో గ్లింప్స్ ముగిసింది. ఆ తర్వాత అక్టోబర్ 18న సినిమా అవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆకట్టుకుంటోంది.
కిరణ్ అబ్బవరం నయా లుక్స్ లో కనిపించి మెప్పించారు. ఫుల్ ఫన్ అందించనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. పక్కా చిల్లర గయ్ గా సినిమాలో కనిపించనున్నట్లు అర్థమవుతుంది. ఆయన డైలాగ్స్ అలాగే ఉన్నాయి. చేతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓవరాల్ గా గ్లింప్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. మరి మీరు చూశారా?
