Begin typing your search above and press return to search.

క2 కోసం టైమ్ తీసుకుంటాడా..?

క తో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఆ నెక్స్ట్ వచ్చిన దిల్ రూబా తో నిరాశపరిచాడు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 8:30 AM IST
క2 కోసం టైమ్ తీసుకుంటాడా..?
X

క తో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఆ నెక్స్ట్ వచ్చిన దిల్ రూబా తో నిరాశపరిచాడు. క హిట్ దిల్ రూబాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది కానీ ఫైనల్ గా ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. ఐతే క చివర్లో క 2 పోస్టర్ వెశారు మేకర్స్. అంటే క కథ కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. క సినిమా అటెంప్ట్ కిరణ్ కథా సెలక్షన్ ఏంటో చూపించింది. కెరీర్ సందిగ్ధంలో ఉన్న టైం లో ఒక సూపర్ హిట్ కొట్టాల్సిన టైం లో కంటెంట్ పరంగా కమర్షియల్ పరంగా అదరగొట్టాడు.

ఐతే క 2 కథ ఎలా ఉంటుంది.. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అన్న విషయాలు మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. దిల్ రూబా తర్వాత ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్నాడు. కె ర్యాంప్ ఒక మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. చెన్నై లవ్ స్టోరీ టైటిల్ లానే ఒక మంచి లవ్ స్టోరీగా వస్తుందని అర్థమవుతుంది.

ఐతే ఈ రెండు సినిమాల తర్వాత అయినా కిరణ్ అబ్బవరం క 2 చేస్తాడా ఇంకా టైం తీసుకుంటాడా అన్నది చూడాలి. ఎందుకంటే క దర్శక ద్వరం సుజిత్, సందీప్ ఇద్దరు క 2 కథను సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వాళ్లు కథ రెడీ అన్నప్పుడే కిరణ్ కూడా సినిమా చేసేందుకు రెడీ అవ్వాల్సి ఉంటుంది. సో క 2 ఎప్పుడన్నది కథ రెడీ అయిన టైం ని బట్టి ఉంటుంది. క ఎలాగు సూపర్ హిట్ కాబట్టి ఆ సినిమా సీక్వెల్ అంటే రెట్టింపు బడ్జెట్ కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

క 2 ఇంకాస్త భారీగా కథలో మరిన్ని ట్విస్టులు ఉండేలా చూస్తున్నారట. దర్శకులు ఇద్దరు కూడా క 2 కథ మీదే తమ టైం స్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే కిరణ్ కమిటైన మిగతా రెండు సినిమాలు పూర్తి చేశాక అప్పటికి క 2 కథ పూర్తైతే వెంటనే క 2 అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే అదేదో సీక్వెల్ చేద్దాం అన్నట్టుగా కాకుండా క 2 ని మరింత క్రేజీగా ఉండేలా చూస్తున్నారట. మరి క 2 తో కిరణ్ అండ్ టీం ఆడియన్స్ ని ఎలా సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి.