Begin typing your search above and press return to search.

ఈసారి ర్యాంప్ ఆడించే రేంజ్ ఫిక్స్..!

ఐతే దిల్ రూబా రిజల్ట్ తేడా కొట్టడంతో కె ర్యాంప్ విషయంలో కిరణ్ మళ్లీ క మార్క్ ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   15 April 2025 5:00 AM IST
ఈసారి ర్యాంప్ ఆడించే రేంజ్ ఫిక్స్..!
X

క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. వరుస సినిమాలు చేస్తున్నా ఫలితాలు సరిగా రాకపోవడం వల్ల కిరణ్ కెరీర్ రిస్క్ లో పడింది. ఈ క్రమంలో క అంటూ ఒక ఎక్స్ పెరిమెంట్ చేసి సక్సెస్ అందుకున్నాడు. క తో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కిన కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా దిల్ రూబాతో వచ్చాడు. క ఇచ్చిన జోష్ తో దిల్ రూబాకి మంచి ప్రమోషన్స్ చేశాడు కిరణ్. క హిట్ కాబట్టి ఆడియన్స్ నుంచి దిల్ రూబాకు మంచి బజ్ ఏర్పడింది. ఐతే రిజల్ట్ మాత్రం మళ్లీ నిరాశపరచింది.

కిరణ్ అబ్బవరం క తర్వాత సినిమా మళ్లీ ఫెయిల్ అవ్వడం తో మళ్లీ అతను ట్రాక్ తప్పినట్టు అయ్యింది. ఐతే దిల్ రూబా సినిమా క ముందే పూర్తి చేసినా క తర్వాత రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి రిలీజ్ చేశారు. ఐతే ఫలితం మాత్రం వాళ్లు ఊహించినట్టుగా రాలేదు. ఇదిలాఉంటే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ కె ర్యాంప్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నాడు.

రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. నాగ శౌర్యతో రణబలి సినిమా చేసిన యుక్తి ఆ తర్వాత తెలుగులో ఛాన్స్ లు అందుకోలేదు. ఐతే ఆ సినిమా టైంలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకున్న అమ్మడు అప్పుడప్పుడు ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది. ఇక కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ తో యుక్తి మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు వస్తుంది.

ఐతే దిల్ రూబా రిజల్ట్ తేడా కొట్టడంతో కె ర్యాంప్ విషయంలో కిరణ్ మళ్లీ క మార్క్ ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎంచుకున్న కథ దానికి తగినట్టుగా స్క్రీన్ ప్లే ఇలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. కె ర్యాంప్ తో నిజంగానే కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి. కె ర్యాంప్ విషయంలో ప్రమోషన్స్ ని కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా మొదలైనప్పుడే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అందరు కలిసి ఫన్ జెనరేట్ చేసేలా టైటిల్ అనౌన్స్ చేశారు. మరి జైన్స్ నాని కిరణ్ అబ్బవరం కాంబో లో వస్తున్న ఈ కె ర్యాంప్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ర్యాంప్ ఆడిస్తుందా లేదా అన్నది చూడాలి.