K- ర్యాంప్ సెట్స్ లో అబ్బవరం.. ఫస్ట్ లుక్ లోడింగ్!
కే- ర్యాంప్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు కిరణ్ అబ్బవరం. ఆ సమయంలో ఒక ఫోటో కూడా షేర్ చేశారు.
By: Tupaki Desk | 10 May 2025 7:49 AMటాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం.. త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల రహస్య సీమంతం జరగ్గా.. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే సమయంలో కిరణ్.. ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ తో మారారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
కే- ర్యాంప్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు కిరణ్ అబ్బవరం. ఆ సమయంలో ఒక ఫోటో కూడా షేర్ చేశారు. మలయాళంలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లోకేషన్ పిక్ ను షేర్ చేసుకుని ఫన్ ఇప్పుడే మొదలైందని క్యాప్షన్ ఇచ్చారు. అందులో కిరణ్.. డోర్ తీసి ఓ రూమ్ లోకి వెళ్లినట్లు కనిపించి ఆసక్తి రేపారు.
ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ అన్న అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కే- ర్యాంప్ తో ర్యాంపాడించండని అంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం కే- ర్యాంప్ పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేటి నుంచే షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
నిజానికి.. క మూవీతో కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ప్రాజెక్టును ఓకే చేశారు. ఆ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా.. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజేష్ దండ గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. 2025లో మూవీ రిలీజ్ అవ్వనుందని టాక్.
అయితే సినిమా షూటింగ్ మొదలైపోయింది కనుక.. ఇక వరుస అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరికొద్ది రోజుల్లో మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ విషయం కూడా వైరల్ గా మారింది. ఫస్ట్ లుక్ కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, క మూవీతో కొద్ది రోజుల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. సింపుల్ గా చెప్పాలంటే ఆయన మార్కెట్, రేంజ్ ఆ మూవీతో పెరిగిపోయాయి. ఆ తర్వాత దిల్ రుబాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క కన్నా ముందు సినిమా అయినా.. లేట్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు కే- ర్యాంప్ తో బిజీగా మారారు. ఆ తర్వాత క- సీక్వెల్ చేయనున్నారు. మరి వరుస ప్రాజెక్టులతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.