Begin typing your search above and press return to search.

100 కోట్లు వస్తేనే హిట్ సినిమా కాదు..!

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:32 AM GMT
100 కోట్లు వస్తేనే హిట్ సినిమా కాదు..!
X

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇన్నాళ్లు లవర్ బోయ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన దుల్కర్ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక మాస్ మూవీ చేశారు. అందుకే ఈ సినిమాకు పర్సనల్ గా ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నాడు దుల్కర్. స్నేహితుడు అభిలాష్ డైరెక్షన్ లో కింగ్ ఆఫ్ కొత్త కచ్చితంగా ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు దుల్కర్ సల్మాన్. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ కింగ్ ఆఫ్ కొత్త సినిమా తెలుగు రిలీజ్ పై కూడా బజ్ బాగానే ఏర్పడింది.

తెలుగులో మహానటి, సీతారామం రెండు హిట్లతో దుల్కర్ క్రేజ్ పెరిగింది. అమ్మాయిలైతే దుల్కర్ సినిమా అంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయ్యారు. తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమకి దుల్కర్ చాలా సంతోషంగా ఉన్నాడు. కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లోనే సినిమా వసూళ్ల మీద తన మార్క్ కామెంట్ చేశారు దుల్కర్. ఒక సినిమా 100 కోట్లు తెస్తేనే హిట్, సూపర్ హిట్ అని అలా కలెక్ట్ చేయకపోతే ఫ్లాప్ అని ఎందుకు అంటారని అన్నారు. భారీగా వసూళ్లు రాకపోయినా ఆడియన్స్ నుంచి అందుకున్న ప్రేమను తక్కువ చేయకూడదని అన్నారు దుల్కర్ సల్మాన్.

సినిమా 100 కోట్లు వస్తేనే సూపర్ హిట్ కాదు అంతకన్నా తక్కువ వసూళ్లు తెచ్చినా అది హిట్ సినిమ్నానే. 100 కోట్లు తెస్తే హిట్ అని ఎవరు నిర్ణయిస్తారో తనకు అర్థం కావట్లేదని.. అది ప్రామాణికం కాదని అన్నారు. బాక్సాఫీస్‌ దగ్గర నంబర్‌ గేమ్‌ చాలా హాస్యాస్పదమని అన్నార్. సినిమా మ్యాజిక్ నెంబర్ తాకనంత మాత్రాన అది పొందిన ప్రేమను తక్కువ చేయకూడదని అన్నారు దుల్కర్. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా పెట్టిన బడ్జెట్ కన్నా మూడు రెట్లు ఎక్కువగా వసూళ్లు తెస్తుంటాయి. కొంతమంది హీరోలు తమ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంటారు. అవి కూడా సక్సెస్ ఫుల్ సినిమాలే అని అన్నారు దుల్కర్.

ఆగష్టు 24న కింగ్ ఆఫ్ కొత్త, సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ అవుతున్న సందర్భంగా విజయ్ దేవరకొండ దుల్కర్ కలిసి ఒక స్పెషల్ చిట్ చాట్ చేశారు. ఆ విషయంపై స్పందించిన దుల్కర్ అనుకోకుండా రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు ప్రమోషన్స్ ఒకే దగ్గర జరిగాయి. తను నా పోస్టర్ చూశారు. నేను తన సినిమా పోస్టర్ ని చూశా.. అలా ఇద్దరం కలిసి ప్రమోషనల్ వీడియో చేశామని చెప్పారు దుల్కర్ సల్మాన్.