Begin typing your search above and press return to search.

దుల్కర్ సల్మాన్ లో మాస్ యాంగిల్.. కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్

గ‌త‌ సినిమాల‌కు భిన్నంగా కింగ్ ఆఫ్ కోతా లో ఫ‌స్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్ లో దర్శనమివ్వబోతున్నాడు

By:  Tupaki Desk   |   10 Aug 2023 11:31 AM GMT
దుల్కర్ సల్మాన్ లో మాస్ యాంగిల్.. కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్
X

మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. నిజానికి దుల్కర్ పేరుకు మళయాళ హీరో అయినా, ఆయనకు దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో ఆలయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. కాగా, ఈ రెండు సినిమాల్లో చాలా కూల్ గా, స్మార్ట్ గా కనిపించిన ఆయన, ఈసారి తనలోని మాస్ యాంగిల్ ని బయటకు తీస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోతా.

గ‌త‌ సినిమాల‌కు భిన్నంగా కింగ్ ఆఫ్ కోతా లో ఫ‌స్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్ లో దర్శనమివ్వబోతున్నాడు. కోతా అనే సిటీపై ఆధిప‌త్యం కోసం పోరాడే రాజు అనే రౌడీ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌బోతున్నాడు. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో దుల్కర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

రౌడీ అవ్వాలనే కోరికతో చిన్నప్పటి నుంచి పెరిగే యువకుడి పాత్రలో దుల్కర్ కనిపించాడు. 'రాజు చిన్న‌ప్ప‌టి యాంబిష‌న్ ఎంటో తెలుసా సార్ వాళ్ల నాన్నలా పెద్ద రౌడీ అవ్వాల‌ని అనేవాడు. అప్పుడు కోతా రాజు చేతిలో ఉండేది. వాడిని దాన వీరు శూరుడు అనేవారు' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ డైలాగ్ వస్తున్న సమయంలో దుల్కర్ సిగరేట్ కాలుస్తూ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక, దుల్కర్ చెప్పిన డైలాగులు కూడా బాగున్నాయి. ఆయన ప్రత్యర్థులతో మాట్లాడిన తీరు, డైలాగులు చెప్పిన విధానం బాగుంది. నీ ముందే ఉన్నాను, ఏం పీక్కుంటావో పీక్కో అంటూ తన శత్రువులను ఆయన సవాలు విసరడం విశేషం. కోతా అనే సిటీపై ఆధిప‌త్యం కోసం రెండు వ‌ర్గాల పోరుతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ సినిమాలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. కింగ్ ఆఫ్ కోతా సినిమాకు అభిలాష్ జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ నెలాఖరికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.