Begin typing your search above and press return to search.

నాగార్జున నమ్మకం నిలబడింది..!

సంక్రాంతికి చాలా కాన్ఫిడెంట్ గా తన సినిమాను రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున నమ్మకం మరోసారి నిలబడింది. నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నా సామిరంగ.

By:  Tupaki Desk   |   15 Jan 2024 5:13 AM GMT
నాగార్జున నమ్మకం నిలబడింది..!
X

సంక్రాంతికి చాలా కాన్ఫిడెంట్ గా తన సినిమాను రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున నమ్మకం మరోసారి నిలబడింది. నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నా సామిరంగ. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. ఆషికా రంగనాథ్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. సంక్రాంతి అంటేనే ప్రత్యేకమైన శోభ, నిండుతనం ఉంటుంది. ఈ పండుగకి కుటుంబంతో కలిసి చూసే సినిమా అందించాలని నాగార్జున చూస్తుంటారు.

అంతకుముందు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా కూడా ఇదే పండుగకి వచ్చి సూపర్ హిట్ కొట్టగా రెండేళ్ల క్రితం వచ్చిన బంగార్రాజు కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఈసారి పండుగకి తన సినిమా ఎలాగైనా దించాలని కేవలం 3 అంటే 3 నెలల్లో నా సామిరంగ పూర్తి చేశారు నాగార్జున. మలయాళ సినిమా రీమేక్ అయినా మాతృక లోని కథా మూలాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చారు.

నా సామిరంగ సినిమా ఆదివారం రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ పండుగకు పండుగ లాంటి సినిమా అంటూ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. నాగార్జున ఊహించినట్టుగానే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ చిత్ర యూనిట్ లో జోష్ నింపింది. పోటీగా వచ్చిన సినిమాల్లో హనుమాన్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే.. గుంటూరు కారం మహేష్ మేనియా తో రన్ అవుతుంది. ఇక సైంధవ్ ఆశించినంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు.

నా సామిరంగ కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా కనిపిస్తుంది. సంక్రాంతికి తన సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున. ఇదే సెంటిమెంట్ తో ప్రతి పండుగకి తనొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను తీసుకొస్తే అక్కినేని ఫ్యాన్స్ సంక్రాంతిని మరింత కలర్ ఫుల్ గా డబుల్ జోష్ తో చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నా సామిరంగ విషయంలో నాగార్జున కాలిక్యులేషన్స్ అన్ని బాగానే వర్క్ అవుట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. కొన్నాళ్లుగా తన సినిమాలకు ఫస్ట్ షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నాగార్జునకు నా సామిరంగ ఫస్ట్ షో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో కింగ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నందుకు రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు, ప్రేక్షకులను థాంక్స్ చెప్పుకున్నారు.