Begin typing your search above and press return to search.

'సారీ చెప్పాల్సిందే.. లేకుంటే కింగ్డమ్ ను అడ్డుకుంటాం'

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన కింగ్డమ్ మూవీ మరో ఐదు రోజుల్లో సందడి చేయనుంది.

By:  Tupaki Desk   |   26 July 2025 12:33 PM IST
సారీ చెప్పాల్సిందే.. లేకుంటే కింగ్డమ్ ను అడ్డుకుంటాం
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన కింగ్డమ్ మూవీ మరో ఐదు రోజుల్లో సందడి చేయనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. జులై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పై జోనర్ లో రూపొందుతున్న కింగ్డమ్ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

వాటిని పెంచేందుకు మేకర్స్ ఫుల్ గా ట్రై చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్ గా కింగ్డమ్ పాడ్ కాస్ట్ పేరుతో టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను రంగంలోకి దించారు. విజయ్, గౌతమ్ తో ఆయన చిట్ చాట్ నిర్వహించగా.. ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ కానుంది.

తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సారీ చెప్పాలని గిరిజన నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈవెంట్ ను అడ్డుకుంటామని రీసెంట్ గా ప్రకటన విడుదల చేశారు.

తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన కోలీవుడ్ హీరో సూర్య రెట్రో చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ హాజరయ్యారని గుర్తు చేశారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడుతూ.. గిరిజనులపై కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు.

"సూర్య రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్.. 500 ఏళ్ల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారని వ్యాఖ్యానించడం దారుణం. దేశంలో 15 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్ లో 85 లక్షల మంది ఉన్న గిరిజన సమాజంపై వ్యాఖ్యలు చేశారు. గిరిజనులు ప్రకృతి ప్రేమికులు" అని తెలిపారు.

సమాజంలో బాధ్యత కలిగిన హీరో ఒక జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. "గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సమాజంలో యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి.. అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈవెంట్ ను అడ్డుకుంటాం" అంటూ వార్నింగ్ ఇచ్చారు గిరిజన నేతలు.