రౌడీ 'కింగ్‌డమ్'కు డెడ్‌లైన్ పెట్టేశారా?
అది 'కింగ్‌డమ్' నెరవేరుతుందని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమాకు అనుకోని అడ్డంకులు ఎదురవుతూ రిలీజ్ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 8:30 PMరౌడీ స్టార్ విజయ్ దేవరకొండలో మునుపటి స్పీడు, ఆ జోష్ కనిపించడం లేదు. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన `లైగర్` దారుణమైన డిజాస్టర్ తరువాత చాలా కామ్ అయిపోయాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి బ్యాడ్ ఫేజ్‌ని ఎదుర్కొంటున్న ఆయన ఇకనైనా మళ్లీ ఓల్డ్ ట్రాక్‌లోకి రావాలని, తనదైన మార్కు సినిమాతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయాలని రౌడీ బాయ్స్ కోరుకుంటున్నారు.
అది `కింగ్‌డమ్` నెరవేరుతుందని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమాకు అనుకోని అడ్డంకులు ఎదురవుతూ రిలీజ్ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. దీంతో సినిమాపై క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని మేకర్స్, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
తన ప్రతి సినిమా రిలీజ్‌ని పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసి మరీ అనుకున్న సమయానికి రిలీజ్ చేసే నాగవంశీ `కింగ్‌డమ్` విషయంలో మాత్రం లెక్క తప్పుతున్నారు. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా రిలీజ్ డేట్ వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీకి తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డెడ్‌లైన్‌ని పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ పెడుతున్న డెడ్ లైన్‌తో పాటు పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` కూడా ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద అడ్డంకిగా మారి ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుండటం గమనార్హం.
ఈ మూవీ కూడా గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా దీన్ని జూలై 24న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫైనల్ చేశారు. డేట్‌ని కూడా రీసెంట్‌గా ప్రకటించడం తెలిసిందే. ఇదే ఇప్పుడు `కింగ్‌డమ్`కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితితుల్ని క్రియేట్ చేస్తోందట. ఈ మూవీ రిలీజైన రెండవ రోజే అంటే జూలై 25నే `కింగ్‌డమ్`ని రిలీజ్ చేయాలని ఓటీటీ వర్గాలు డెడ్‌లైన్ పెట్టేయడంతో టీమ్ ఏం చేయాలో తెలియని అయోమయానికి లోనవుతోందట. సూర్య దేవర నాగవంశీ గత కొన్ని రోజులుగా పవన్ హరి హర వీరమల్లు రిలీజ్‌ని బట్టి తమ కింగ్‌డమ్‌ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓత్తిడితో హరి హరతో ఢీకొట్టక తప్పని పరిస్థితి. దీంతో అదే రోజున కింగ్‌డమ్‌ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అదే జరిగితే రౌడీ వర్సెస్ పవన్ పోటీ అనివార్యం అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.