కింగ్ డమ్.. రిలీజ్ డేట్ కోసం హై వోల్టేజ్ ట్రీట్!
ఇక లేటెస్ట్ గా, "కింగ్ డమ్" రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం మేకర్స్ మాస్ ట్రీట్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
By: Tupaki Desk | 7 July 2025 2:59 PM ISTటాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం "కింగ్ డమ్". గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ గత సినిమాల ట్రాక్, గౌతమ్ టేకింగ్ మీద నమ్మకంతో ఈ సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే విడుదల తేదీ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్నారు అభిమానులు.
ఇక లేటెస్ట్ గా, "కింగ్ డమ్" రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం మేకర్స్ మాస్ ట్రీట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇది యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రూపంలో రానుంది. ఈ టీజర్‌నే విడుదల తేదీ ప్రకటించేందుకు వేదికగా ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. ఈ టీజర్ కోసం ప్రత్యేకంగా గ్రాండ్ లెవెల్‌లో ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డిజైన్ జరుగుతోందని చిత్రబృందం వర్గాల నుండి సమాచారం.
దీని ద్వారా రిలీజ్ డేట్‌తో పాటు సినిమాపై మళ్లీ హైప్ క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇప్పటికే "కింగ్ డమ్" టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రూపంలో వచ్చిన రెస్పాన్స్ బాగుండటంతో, మేకర్స్ ఈ సారి మరింత హైప్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌లో ఉన్న యాక్షన్ బ్లాస్ట్, విజయ్ లుక్, అనిరుధ్ మ్యూజిక్.. సాలీడ్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి విడుదల తేదీపై ఎలాంటి గందరగోళం ఉండకుండా స్పష్టంగా తెలియజేయనున్నారని ట్రేడ్ టాక్.
ప్రస్తుతం సినిమా పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం "కూలీ" సినిమాతో బిజీగా ఉన్నా, "కింగ్ డమ్" కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. టీజర్‌కు సెట్ చేసే బీజీఎమ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మేకర్స్ నుంచి వచ్చే అప్డేట్ ద్వారా ఈ సినిమా జూలై 31న విడుదలయ్యే ఛాన్సెస్ పక్కాగా ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, విజయ్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ కథలో శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో కొన్ని సంచలన అంశాల్ని చూపించబోతున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి తన స్టైల్ లో సీరియస్ డ్రామా, యాక్షన్ మిక్స్ చేస్తూ సరికొత్త ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి, "కింగ్ డమ్" మళ్లీ ట్రాక్‌లోకి వస్తోంది. టీజర్‌తో కలిసి రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఎట్టకేలకు గందరగోళానికి చెక్ పెట్టే టైమ్ వచ్చిందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ యాక్షన్ టీజర్ ఎంత వరకు హైప్ పెంచుతుందో చూడాలి.
