Begin typing your search above and press return to search.

కింగ్‌డమ్.. నాగవంశీ కాన్ఫిడెన్స్ ఏ స్తాయిలో ఉందంటే..

విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాపై మొదటి నుంచి భారీ బజ్ నెలకొంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 2:13 PM IST
కింగ్‌డమ్.. నాగవంశీ కాన్ఫిడెన్స్ ఏ స్తాయిలో ఉందంటే..
X

విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాపై మొదటి నుంచి భారీ బజ్ నెలకొంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా శ్రీలంక నేపథ్యంలో సాగే ఇంటెన్స్ డ్రామాగా ఉండబోతుందట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ డేట్ మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది.

లేటెస్ట్ గా నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియాలో స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏం పోస్ట్ చేసినా కింగ్‌డమ్ మీద రకరకాల స్వీట్ శాపాలు వస్తాయని తెలుసు,” అంటూ ఓ స్మైలీతో ప్రారంభించిన ఆయన, ఫ్యాన్స్‌లోని నెగటివిటీని స్వీకరించినట్టుగా చెప్పారు. కానీ వెంటనే భరోసా ఇస్తూ, “మా టీమ్ రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తోంది. మీరు థియేటర్‌లో చూడబోయే అనుభవం మామూలుగా ఉండదు. ఈ సినిమా ఇచ్చే రష్ నిజంగా అన్‌రియల్!” అంటూ హైప్ పెంచారు.

తాను చెప్పిన మాటల పట్ల జాగ్రత్తగా ఉంటానని చెప్పిన వంశీ, “ఏదైనా చెప్తే.. నమ్మకంతో చెప్తాను. ఒకవేళ అది మిస్ మీ క్రియేటివిటీ చూపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం గట్టిగా చెప్తున్నా… కింగ్‌డమ్ లో విన్నర్ అని రాసి ఉంది,” అంటూ స్ట్రాంగ్‌గా కామెంట్ చేశారు. ఇది సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉందని అర్ధమవుతుంది.

ఇదొక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఇందులో గౌతమ్ తిన్ననూరి స్టైల్ డ్రామా పుష్కలంగా ఉంటుందని వంశీ స్పష్టం చేశారు. అంటే ఈసారి గౌతమ్ తన సైగ్నేచర్ స్టైల్‌కు యాక్షన్‌ మాస్ టచ్‌ను మిక్స్ చేసి వేరే లెవెల్ ఎమోషన్ అందించబోతున్నారని అర్థమవుతోంది. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది.

ఇక రిలీజ్ డేట్ గురించి కూడా క్లూ ఇచ్చాడు నాగ వంశీ. “త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం,” అంటూ ట్వీట్‌లో చెప్పారు. అంటే జూలై చివరలో కానీ, ఆగస్టులో కానీ మేకర్స్ ఓ పక్కా అప్డేట్‌తో రావడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌కి ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎనర్జీతో సినిమా క్రేజ్‌కి రెక్కలు వచ్చాయి. మొత్తానికి సినిమా ఆలస్యం అవుతున్నా… ప్రచారాల్లో మాత్రం ఓ మోస్తరుగా నెట్టుకెళ్తోంది. నిర్మాత నాగ వంశీ ట్వీట్‌తో మళ్లీ సినిమాపై నమ్మకం పెరిగింది. త్వరలోనే రిలీజ్ డేట్, ప్రమోషన్లతో ఫుల్ స్థాయిలో కింగ్‌డమ్ మళ్లీ బజ్‌లోకి వస్తుందని అర్ధమవుతుంది.