Begin typing your search above and press return to search.

కింగ్ డమ్ కలెక్షన్స్ షాక్..!

గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సూరి పాత్రలో నటించాడు.

By:  Tupaki Desk   |   2 Aug 2025 12:00 PM IST
కింగ్ డమ్ కలెక్షన్స్ షాక్..!
X

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. ఐతే ఫస్ట్ షో నుంచి ఇదే టాక్ కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సినిమా బాగుందని అంటున్నా సరే కామన్ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఇక ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టాడు విజయ్ దేవరకొండ. ఐతే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ లో డ్రాప్స్ కనిపిస్తున్నాయి. సినిమాకు వచ్చిన ఈ టాకే సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపించిందని చెప్పొచ్చు.

విజయ్ దేవరకొండ సూరి పాత్రలో..

గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సూరి పాత్రలో నటించాడు. యాక్టింగ్ పరంగా విజయ్ మెప్పించాడు. ఐతే కథ, కథనాలు ఇంకా సెకండ్ హాఫ్ ఆశించిన లేకపోవడం వల్ల సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మేకర్స్ ఈ సినిమా సూపర్ హిట్ అని అంటున్నా సరే కామన్ ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారంగానే కలెక్షన్స్ ఉన్నాయి.

కింగ్ డం సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ మేజర్ హైలెట్స్ లో ఒకటి. సినిమాను కాపాడింది ఆయనే. ఐతే భాగ్య శ్రీ బోర్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ హర్ట్ అయ్యారు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అసలేమాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఆమెతో ఉన్న ఒక సాంగ్ ని కూడా లేపేశారు. సినిమా ఫ్లో మిస్ చేస్తుందని ఆ సాంగ్ మిస్ చేశారని అన్నారు నిర్మాత నాగ వంశీ. కానీ ఆ పాట కోసం సినిమాకు వచ్చిన ఆడియన్స్ కూడా ఉన్నారు.

భారీగా కలెక్షన్స్ డ్రాప్..

విజయ్ దేవరకొండ కింగ్ డం కి ఓవర్సీస్ లో కూడా మంచి బజ్ రాగా అక్కడ ప్రీమియర్స్ తో మంచి కలెక్షన్స్ వచ్చినా రెండో రోజు నుంచి అక్కడ కూడా భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని తెలుస్తుంది. కింగ్డం కలెక్షన్స్ విషయంలో ఈ డ్రాప్స్ రౌడీ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నాయి. ఫుల్ రన్ లో సినిమా ఎంత వసూళ్లు చేస్తంది. సినిమా పరిస్థితి ఏంటన్నది వీకెండ్ దాటితే కానీ తెలియదు. ఈ వీకెండ్ వరకు ఆల్రెడీ బుక్ చేసుకున్న వారు ఉంటారు. సినిమాకు వచ్చిన ఈ మిశ్రమ స్పందన పై మండే నుంచి ఎలాంటి వసూళ్లు తెస్తుందో చూడాలి.