కింగ్ డమ్ అన్న అంటేనే సాంగ్ ప్రోమో..!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమా ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది.
By: Tupaki Desk | 15 July 2025 11:18 PM ISTవిజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమా ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన లవ్ సాంగ్ సూపర్ హిట్ కాగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో వదిలారు మేకర్స్. అన్న అంటేనే అంటూ బ్రదర్స్ మధ్య సాంగ్ రిలీజ్ చేశారు.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో విజయ్ బ్రదర్ గా సత్యదేవ్ నటిస్తున్నాడు. సినిమాలో అతని రోల్ కూడా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అన్న అంటేనే సాంగ్ ప్రోమోతోనే సూపర్ అనిపించేసింది. కృష్ణ కాంత్ రచించిన ఈ సాంగ్ ని అనిరుద్ రవిచందర్ ఆలపించారు. సినిమాలో ఇదొక మంచి ఎమోషనల్ సాంగ్ లా అనిపిస్తుంది.
అన్న అంటేనే ఫుల్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా అదిరిపోయింది. సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ ఐనిపించేలా ఉంది. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ తో వచ్చినా విజయ్ ఆ సినిమాను సక్సెస్ అందుకోలేదు. ఐతే గౌతం తో చేస్తున్న కింగ్ డం సినిమా మీద మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా సినిమా సూపర్ హిట్ కొట్టేలా ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో తిరిగి కంబ్యాక్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్ అనిపించేలా ఉంది. జూలై 31న రిలీజ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ ఏమేరకు అంచనాలను అందుకుంటుంది అన్నది చూడాలి. కెరీర్ లో వరుస ఫ్లాపులతో విజయ్ కాస్త వెనకపడ్డాడు. ఐతే కింగ్ డం సినిమా మీద మాత్రం విజయ్ సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో భాగ్య శ్రీ పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు. విజయ్ కోరుకునే బ్లాక్ బస్టర్ హిట్ గా కింగ్ డమ్ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.
