'కింగ్డమ్ లో పక్కా అనిరుధ్ స్టైల్ సాంగ్.. అదే లైవ్ లో కూడా..'
దీంతో మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 19 July 2025 11:11 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటిస్తున్న కింగ్డమ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్పై జోనర్ లో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా సినిమాలో సందడి చేయనున్నారు.
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జులై 31వ తేదీన సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
దీంతో మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత నాగ వంశీ ఫుల్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పెషల్ సాంగ్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మాట్లాడారు.
"సినిమాలో చివరి 20 నిమిషాల్లో కింగ్డమ్ టైటిల్ ను జస్టిఫై చేస్తాం. అదే టైమ్ లో హీరో ఎలివేషన్స్ పై సాంగ్ ఉంటుంది. పక్కా అనిరుధ్ రవిచందర్ స్టైల్ లో ఉండనుంది. ఆ సాంగ్ పై ఇంకా వర్క్ చేస్తున్నారు. అదే సాంగ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుధ్ తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇప్పించాలని నాకు కోరిక ఉంది" అని తెలిపారు.
ఇప్పటికే ఆ విషయాన్ని అనిరుధ్ కు చెప్పినట్లు నాగవంశీ చెప్పారు. ఆ సాంగ్ కంప్లీట్ అయ్యాక.. అదే ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. దీంతో నాగ వంశీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెయిటింగ్ ఫర్ సాంగ్ అంటూ విజయ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
ఎందుకంటే అనిరుధ్ రవిచందర్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. తన వర్క్ తో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఎలివేషన్స్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నాగవంశీ కామెంట్స్ తర్వాత అనిరుధ్ సాంగ్ వేరే లెవెల్ లో ఉండనున్నట్లు అర్థమవుతుంది. అదే సాంగ్ లైవ్ ఫర్మార్మెన్స్ అంటే సినీ ప్రియులకు, మ్యూజిక్ లవర్స్ కు పండగే.
