Begin typing your search above and press return to search.

ఆ నటి హ్యాండ్ బ్యాగ్‌ ఖరీదు రూ.3.12 కోట్లు

అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ ఫ్యాషన్‌ రంగంలో రాణిస్తూ ఉంటుంది. ఆమె ప్రతి ఔట్ ఫిట్ మరియు యాక్ససరీస్ కూడా లగ్జరీగా ఉంటుంది

By:  Tupaki Desk   |   31 July 2023 12:01 PM GMT
ఆ నటి హ్యాండ్ బ్యాగ్‌ ఖరీదు రూ.3.12 కోట్లు
X

సాధారణంగా లేడీస్ కి హ్యాండ్ బ్యాగ్స్‌ అంటే చాలా మోజు ఉంటుంది. ఆ మోజుతో ఒకటి ఉన్నా కూడా మరోటి కొనుగోలు చేస్తూ ఉంటారు. సెలబ్రెటీలు కూడా హ్యాండ్ బ్యాగ్స్ పై భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఆ మధ్య ఒక బాలీవుడ్‌ నటి పాతిక లక్షల హ్యాండ్ బ్యాగ్‌ ను తన చేతిలో పట్టుకోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు.

బాబోయ్ ఒక హ్యాండ్ బ్యాగ్ కి పాతిక లక్షలు ఏంట్రా బాబు అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ భార్య అంతకు మించిన ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌ ను కలిగి ఉన్న విషయం కూడా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ హ్యాండ్‌ బ్యాగులన్నీ పక్కన పెట్టి మూడు కోట్ల హ్యాండ్‌ బ్యాగ్‌ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.

అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ ఫ్యాషన్‌ రంగంలో రాణిస్తూ ఉంటుంది. ఆమె ప్రతి ఔట్ ఫిట్ మరియు యాక్ససరీస్ కూడా లగ్జరీగా ఉంటుంది. ఆమె సంపాదనకు తగ్గట్లుగానే ఖర్చు ఉంటుంది. తాజాగా ఆమె ఏకంగా మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయల హ్యాండ్‌ బ్యాగ్‌ ను తన చేతిలో పట్టుకుని కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సిల్వర్ కలర్ లో తెగ మెరిసి పోతున్న ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ అసలు ధర రూ.3,12,61,000 అంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తోంది. ప్రముఖ హిర్మెన్ కంపెనీ ఈ హ్యాండ్ బ్యాగ్‌ ను తయారు చేయడం జరిగింది.

బంగారం తో పాటు పెద్ద మొత్తం లో ఖరీదైన డైమండ్స్ ను ఈ బ్యాగ్ తయారీ కి వినియోగించడం వల్ల దీని ధర మూడు కోట్లకు పైగా పలికినట్లుగా సదరు కథనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నటి హ్యాండ్ బ్యాగ్‌ గురించి అంతర్జాతీయ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు అన్ని చోట్ల చర్చ జరుగుతోంది.