ఎక్కడపడితే అక్కడ నిద్రపోతున్నాడని విడాకులు?
కిమ్ కర్ధాషియన్ - కెన్యే వేస్ట్ జంట ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కోర్టులో విడాకుల ప్రాసెస్ జరుగుతున్న సమయంలో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది ఈ జోడీ
By: Tupaki Desk | 13 Aug 2025 6:00 AM IST``నా భర్త ఎక్కడ పడితే అక్కడ గురక పెట్టి నిద్రపోతాడు.. తన స్నేహితులు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా తాను మాత్రం హాయిగా నిద్రపోగలడు. అందుకే విడాకులిచ్చాను`` అని ప్రకటించింది ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, అమెరికన్ బిజినెస్ ఉమెన్- మీడియా పర్సనాలిటీ కిమ్ కర్ధాషియన్.
కిమ్ కర్ధాషియన్ - కెన్యే వేస్ట్ జంట ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కోర్టులో విడాకుల ప్రాసెస్ జరుగుతున్న సమయంలో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది ఈ జోడీ. ఇకపోతే కిమ్ కర్ధాషియన్- కోలే కర్ధాషియన్ సిస్టర్స్ ఇద్దరూ గత ఏడాది ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల పెళ్లికి అటెండ్ అయిన సంగతి తెలిసిందే. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లిలో కిమ్ - కోలే రకరకాల డిజైనర్ దుస్తుల్లో హొయలు పోయిన తీరు ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ అమెరికన్ అందగత్తెలు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి, చీరలు కట్టుకుని అందరినీ మురిపించారు. అయితే నెలల పాటు సాగిన అంబానీల పెళ్లిలో ఒకరోజు కర్ధాషియన్ తన ఖరీదైన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకుందని కథనాలు రావడం షాకిచ్చింది.
అదంతా అటుంచితే కిమ్ కర్ధాషియన్ ఇప్పుడు తన భర్త కెన్యేకే విడాకులివ్వడానికి చెప్పిన కారణం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. కెన్యే చాలా సులువుగా నిదురిస్తాడు. ఎక్కడపడితే అక్కడ నిదురిస్తాడు. అది బాత్రూమ్, హోటల్, గెస్ట్ రూమ్ లేదా ఎక్కడికి వెళ్లినా అక్కడ కూచున్న చోటే నిదురపోతాడని ఆరోపించింది కిమ్ కర్ధాషియన్. తాను మంచి మూడ్ లో ఉంటే అతడికి బాగా నిదురొస్తుంది. ఔటింగులకు వెళ్లినప్పుడు, మీటింగుల్లో ఉన్నప్పుడు, లేదా తన స్నేహితులను నాకు పరిచయం చేసిన సమయంలో కూడా అతడు నిదురపోతాడు. కూచున్నచోటే నిదురపోగలడు. ఒక్కోసారి రెస్టారెంట్ లో కూడా అతడు గురకపెట్టి జనరేటర్ లా సౌండ్ చేస్తూ నిదురపోతాడని ఎగతాళి చేసింది. ఈ అతి నిద్ర కారణంగానే అతడికి విడాకులిచ్చానని పర్టిక్యులర్ గా చెప్పింది కర్ధాషియన్. అయితే కొసరుగా కెన్యే వెస్ట్ చాలా మంచి వాడు! అంటూ మాజీతో అనుబంధంపై ఒక గొప్ప ముసుగు వేసింది.
