Begin typing your search above and press return to search.

కెప్టెన్ మిల్లర్.. హై వోల్టేజ్ సౌండ్!

ఇక కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కిల్లర్‌ కిల్లర్‌ అని సాగే పాటను ముందుగా విడుదల చేశారు. సాంగ్ లో ధనుష్‌ ఎర్రటి స్కార్ప్‌ కట్టుకుని చేతిలో తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తూ ఔరా అనిపించాడు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 1:50 PM GMT
కెప్టెన్ మిల్లర్.. హై వోల్టేజ్ సౌండ్!
X

విభిన్నమైన సినిమాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ధనుష్ నెక్స్ట్ మరో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న కెప్టెన్‌ మిల్లర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచుతున్నారు. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.


ఇక కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కిల్లర్‌ కిల్లర్‌ అని సాగే పాటను ముందుగా విడుదల చేశారు. సాంగ్ లో ధనుష్‌ ఎర్రటి స్కార్ప్‌ కట్టుకుని చేతిలో తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తూ ఔరా అనిపించాడు. టాలీవుడ్ సింగర్ హేమచంద్ర పాడిన ఈ పాట మంచి వైబ్ క్రియేట్ చేస్తోంది. అలాగే సినిమాపై అంచనాలను పెంచుతోంది. టైటిల్‌ ట్రాక్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరో ధనుష్‌ కామ్రేడ్‌ అవతార్‌లో.. సమరానికి అందరినీ మేల్కొలుపుతున్నట్టుగా ఉన్న ఈ పాటను జీవి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేశారు. ధనుష్ సీరియస్ లుక్ ఇప్పటికే ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అయ్యింది. ఇక ఈ పాట మరీంత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ధనుష్ కు జోడిగా నటించింది.

అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్‌ కిషన్‌ తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేకమైన పాత్రలలో నటించారు. అలజీబ్నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్ఆర్ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్‌ ఫ్రీడమ్ కోసం పోరాడే ఒక యోధుడి స్పూర్తితో తెరక్కుతోంది.

ఇక దర్శకుడు ఈ సినిమాను పార్టులుగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ రాలేదు కానీ అదే నిజమని కోలీవుడ్ లో టాక్ వస్తోంది. ఇక సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ కెప్టెన్‌ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక కెప్టెన్‌ మిల్లర్‌ ఆడియో రైట్స్‌ను పాపులర్ సంస్థ సరిగమ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.