'కిల్' రీమేక్.. హీరో - డైరెక్టర్ ఎవరంటే?
బాలీవుడ్ లో ఇటీవల విడుదలై హై వోల్టేజ్ యాక్షన్ తో అలరించిన చిత్రం కిల్ ఇప్పటికే పలు దేశాల్లో ప్రశంసలు అందుకుంది.
By: Tupaki Desk | 7 July 2025 7:00 AM ISTబాలీవుడ్ లో ఇటీవల విడుదలై హై వోల్టేజ్ యాక్షన్ తో అలరించిన చిత్రం కిల్ ఇప్పటికే పలు దేశాల్లో ప్రశంసలు అందుకుంది.ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా సినిమాలో చూపించిన రౌడీ యాక్షన్, ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. లక్ష్యా హీరోగా నటించిన ఈ సినిమాను నిఖిల్ నాగేష్ భట్ డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.
అదేంటంటే.. కిల్ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. దీనిలో హీరోగా నరించబోయేది ధ్రువ్ విక్రమ్ అని తెలుస్తోంది. నటుడు విక్రమ్ కుమారుడైన ధ్రువ్ ఇప్పటికే ‘అధిత్య వర్మ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కిల్ రీమేక్ పై ఫోకస్ పెట్టినట్లు టాక్. అయితే ఈ రీమేక్ మూవీకి దర్శకుడిగా రమేష్ వర్మ వ్యవహరిస్తున్నాడు.
తెలుగులో 'ఖిలాడి' వంటి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు తగ్గట్టుగా కిల్ మూవీని రీమేక్ చేయనున్నాడు. హిందీ వెర్షన్‌లో రైలు ప్రయాణ సమయంలో జరిగిన హత్యాకాండ కథగా సాగుతుంది. అదే విధంగా తమిళ వర్షన్‌లో కూడా ఉత్కంఠతతో కూడిన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా.. సపోర్టింగ్ క్యాస్ట్, టైటిల్ వంటి ఇతర వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇప్పటికే ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న మరో చిత్రం బిసన్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే కిల్ రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ధ్రువ్ విక్రమ్ ప్రస్తుతం తన కథల ఎంపికల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా, సీరియస్ కాన్సెప్ట్ ఉన్న కథలు, డిఫరెంట్ స్క్రిప్ట్‌లపై దృష్టి పెడుతున్నాడు. కిల్ రీమేక్ లో కూడా ఆయన పాత్రను కొత్తగా డిజైన్ చేయబోతున్నారని సమాచారం. మరి ఈ చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
