Begin typing your search above and press return to search.

సలార్ పృథ్వీరాజ్.. కిల్లర్ లుక్

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ కి సంబందించిన లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 7:30 AM GMT
సలార్ పృథ్వీరాజ్.. కిల్లర్ లుక్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈయన పాత్రకి సంబందించిన లుక్ ఇప్పటికే రిలీజ్ చేశారు. అలాగే సలార్ టీజర్ లో కూడా ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ కి భాగా ఎలివేట్ చేశారు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ కి సంబందించిన లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పోస్టర్ లుక్ లో పృథ్వీరాజ్ చాలా సీరియస్ నోట్ లో ముక్కుకి రింగుతో బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

సలార్ కేస్ ఫైర్ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతోందని తెలుస్తోంది. పార్ట్ 2లో జగపతి బాబు పాత్ర కీలకంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. సలార్ కి పోటీగా డుంకీ మూవీ రిలీజ్ అవుతోంది. అయితే ఈ రెండింటిలో సలార్ సినిమాపైన ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం.

మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ఇదే కావడం సలార్ పై ఎక్స్ పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి.