బిగ్ బాస్ హోస్ట్.. ఆయన మళ్లీ తిరిగొస్తున్నారోచ్..!
బిగ్ బాస్ అనగానే బుల్లితెర ఆడియన్స్ కి ఒక సెపరేట్ క్రేజ్.. భాష ఏదైనా బిగ్ బాస్ షో నడుస్తుంది అంటే ఆ 100 డేస్ ఆ షోకి ఆడియన్స్ అతుక్కుపోతుంటారు.
By: Tupaki Desk | 1 July 2025 10:31 PM ISTబిగ్ బాస్ అనగానే బుల్లితెర ఆడియన్స్ కి ఒక సెపరేట్ క్రేజ్.. భాష ఏదైనా బిగ్ బాస్ షో నడుస్తుంది అంటే ఆ 100 డేస్ ఆ షోకి ఆడియన్స్ అతుక్కుపోతుంటారు. బిగ్ బాస్ తెలుగు అయితే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక నెక్స్ట్ 9వ సీజన్ కి బిగ్ బాస్ టీం సిద్ధం అవుతున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు మొదలయ్యే టైం వచ్చినా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇంకా హోస్ట్ గా కొత్త స్టార్ అంటూ మీడియా హడావిడి చేస్తుంది. హిందీ తర్వాత సూపర్ హిట్ అవుతున్నది కేవలం తెలుగు బిగ్ బాస్ మాత్రమే. నాగార్జున హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇక కన్నడలో బిగ్ బాస్ 11 సీజన్లు పూర్తయ్యాయి. అక్కడ కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తూ వచ్చారు. ఐతే లాస్ట్ సీజన్ అదే 11వ సీజన్ ముగింపు టైం లో బిగ్ బాస్ హోస్ట్ కి గుడ్ బై చెబుతున్నా అంటూ చెప్పారు. బిగ్ బాస్ కన్నడకి కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు, తమిళ్ నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కిచ్చ సుదీప్ హోస్టింగ్ అదిరిపోతుంది.
ఐతే కన్నడ లో బిగ్ బాస్ క్లిక్ అవ్వట్లేదు ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోవట్లేదు అన్న కారణం వల్లే సుదీప్ బిగ్ బాస్ హోస్ట్ వీడాలని అనుకున్నారట. ఐతే కొత్త సీజన్ కు చాలా మార్పులు చేస్తున్నారని.. తన సూచనలను తీసుకుంటున్నారని చెప్పారు సుదీప్. దాని వల్లే మళ్లీ హోస్ట్ గా కొనసాగేందుకు ఓకే చెప్పానని వెల్లడించారు.
బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ మాత్రమే కాదు 4 సీజన్లు కొనసాగుతా అన్నారు సుదీప్. మొత్తానికి కిచ్చ సుదీప్ రాకతో బిగ్ బాస్ కన్నడ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వచ్చింది. ఐతే సుదీప్ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటానని చెప్పినప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్, స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ అంతా ఆయన్ను హోస్ట్ గా కొనసాగాలని రిక్వెస్ట్ చేశారు. షో నిర్వాహకులు కూడా షోని సెటప్ మార్చేందుకు అంగీకరించడంతో సుదీప్ హోస్ట్ గా కంటిన్యూ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు గాను కొత్త సీజన్ కు సుదీప్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
