Begin typing your search above and press return to search.

ఘాటు కౌగిలి.. నాటు లిప్ లాక్ అదీ సంగ‌తి!

అవును.. ఆమె ఘాడంగా అత‌డి కౌగిలిలో ఒదిగిపోయింది. అంతేనా.. ప‌బ్లిక్ చూస్తుండ‌గానే అత‌డికి డీప్ లిప్ కిస్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   16 Jan 2024 9:49 AM GMT
ఘాటు కౌగిలి.. నాటు లిప్ లాక్ అదీ సంగ‌తి!
X

అవును.. ఆమె ఘాడంగా అత‌డి కౌగిలిలో ఒదిగిపోయింది. అంతేనా.. ప‌బ్లిక్ చూస్తుండ‌గానే అత‌డికి డీప్ లిప్ కిస్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఘాడ‌మైన హ‌గ్గింగులు డీప్ కిస్సింగులకు వేదిక అయింది కియ‌రా హ‌బ్బీ సిధ్ బ‌ర్త్ డే వేడుక‌.

సిద్ధార్థ్ మల్హోత్రా మంగళవారం తన 39వ పుట్టినరోజును జరుపుకున్నాడు. కియారా అద్వానీని పెళ్లి చేసుకున్న తర్వాత తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నాడు. అత‌డు తన పుట్టినరోజును తన‌ ముంబై ఇంటిలో మిడ్ నైట్ ఘ‌నంగా మోగించాడు. కియారా ఇప్పుడు అర్ధరాత్రి తన కేక్ కటింగ్ వేడుక కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసి సోషల్ మీడియాలో సిద్ధార్థ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ లో కియారా 'హ్యాపీ బర్త్‌డే లవ్' అని రాసి ఉన్న వీడియో మాంటేజ్‌ను షేర్ చేసింది. ఇది సిద్ధార్థ్- కియారా తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కౌగిలింతలు ఘాడ‌మైన‌ ముద్దుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో సునామీ సృష్టించింది. సిధ్ రంగురంగుల టీ-షర్ట్‌లో కనిపిస్తుండగా, కియ‌రా బ్లాక్ క‌ల‌ర్ దుస్తులలో కనిపించింది.

సిద్ధార్థ్ ఈ వేదిక‌పై ప్రత్యేక బ‌ర్త్ డే కేక్‌ను కత్తిరించాడు. ఒక ఫిల్మ్ రీల్ కూడా కేక్ చుట్టూ చుట్టి, దానిపై సిద్ధార్థ్ ఫోటోల పోస్టర్లు ముద్రించి ఉన్నాయి. సిద్ధార్థ్ పుట్టినరోజు వేడుకల్లోని ఇతర ఫోటోల్లో కరణ్ జోహార్, శకున్ బాత్రా, కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ, కాజల్ ఆనంద్ త‌దిత‌ర స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ ఫోటోల‌లో సిద్ధార్థ్ -కియారా ముంబై ఇంటి కి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. ఇల్లు తెలుపు, లేత గోధుమరంగు, గోధుమ రంగులలో అలంకరించి ఉంది. షేర్షా సినిమా సెట్స్‌లో ప్రేమలో పడిన తరువాత, సిద్ధార్థ్- కియారా గత సంవత్సరం ఫిబ్రవరిలో జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో రాయల్ హిందూ స్ట‌యిల్ లో వివాహం చేసుకున్నారు. త్వరలో వారు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సిద్ధార్థ్ త్వరలో స్ట్రీమింగ్ కానున్న‌ వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్‌'తో తన డిజిటల్ రంగ ప్రవేశం చేయనున్నాడు. రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన ఈ సిరీస్‌లో వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది ప్రసారం అవుతుంది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో యోధాలోను సిధ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. సాగర్ అంబ్రే , పుష్కర్ ఓజా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సిద్దార్థ్ ప్రధాన పాత్ర పోషించాడు.