Begin typing your search above and press return to search.

చెప్పులకు మరీ అంత ఎందుకు కియారా?

కియారా అద్వానీ ఈ ఏడాది గూగుల్‌ లో అత్యధికంగా వెతకబడిన బాలీవుడ్‌ సెలబ్రిటీగా నిలిచిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   29 Dec 2023 9:56 AM GMT
చెప్పులకు మరీ అంత ఎందుకు కియారా?
X

ఎంఎస్‌ ధోని సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గరయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తెలుగు లో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంటనే రామ్‌ చరణ్‌ కి జోడీగా వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్‌ కి పరిమితం అయింది.


బాలీవుడ్‌ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఈమె తెలుగు లో రామ్‌ చరణ్‌ కి జోడీగా శంకర్‌ దర్శకత్వం లో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం హిందీలో ఈ అమ్మడు సత్యప్రేమ్ కి కథ అనే సినిమా లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.

కియారా అద్వానీ ఈ ఏడాది గూగుల్‌ లో అత్యధికంగా వెతకబడిన బాలీవుడ్‌ సెలబ్రిటీగా నిలిచిన విషయం తెల్సిందే. ప్రేమ మరియు పెళ్లి విషయాలపై నెటిజన్స్ ఆసక్తి చూపించి గూగుల్ లో వెతకడం జరగింది. ఇప్పుడు కియారా చెప్పుల గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

తాజాగా కియారా తన భర్త సిద్దార్థ్ మల్హోత్ర తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో లో కియారా ధరించిన చెప్పుల ధర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ప్రత్యేకమైన చెప్పులకు రూ.88 వేలుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాబోయ్‌ ఇంత రేటు ఎందుకు అంటూ చాలా మంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీల డ్రెస్ లు మరియు చెప్పులకు వేలకు వేల రూపాయల ధరలు ఉండటం చాలా కామన్ విషయం అంటూ కొందరు కియారా చెప్పుల ధరలను లైట్ తీసుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం బాబోయ్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.