Begin typing your search above and press return to search.

చూపుల్తో నిషా ఎక్కించేస్తుంది..!

బాలీవుడ్ లో దీపికా పదుకొనే, అలియా భట్ లకు ఆల్టర్నేట్ గా మారుతుంది క్రేజీ బ్యూటీ కియరా అద్వాని

By:  Tupaki Desk   |   19 March 2024 7:46 AM GMT
చూపుల్తో నిషా ఎక్కించేస్తుంది..!
X

బాలీవుడ్ లో దీపికా పదుకొనే, అలియా భట్ లకు ఆల్టర్నేట్ గా మారుతుంది క్రేజీ బ్యూటీ కియరా అద్వాని. ఫగ్లీ తో బాలీవుడ్ కెరీర్ మొదలు పెట్టిన కియరా అద్వాని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ రేంజ్ కి వెళ్లింది. సినిమా ఎలాంటిదైనా తను లీడ్ రోల్ కాకపోయినా తనకు ఇచ్చిన పాత్ర పర్ఫెక్ట్ గా చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చింది కియరా. అందుకే అమ్మడు ఇప్పుడు అక్కడ టాప్ ప్లేస్ లో దూసుకెళ్తుంది. హిందీతో పాటు తెలుగులో కూడా రెండు సినిమాలు చేసి ఇక్కడ ఆడియన్స్ కు ఫేవరెట్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా వస్తున్న గేమ్ చేంజర్ లో నటిస్తున్న కియరా హృతిక్ రోష, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న వార్ 2 లో కూడా ఛాన్స్ అందుకుంది. దీపికా, అలియా, జాన్విలను దాటి ఈ ఛాన్స్ తన దాకా వచ్చిందంటే కియరా క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఓ పక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అలరిస్తుంది కియరా. లేటెస్ట్ గా అమ్మడి లైట్ బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్ తో ఫాలోవర్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

కేవలం సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో మెప్పిస్తే సరిపోదు ఫాలోవర్స్ ని తమ ఫోటో షూట్స్ తో కూడా అలరించాలని చూస్తున్నారు ఈ తరం కథానాయికలు. అందుకే కాస్త టైం దొరికితే చాలు ఇలా ఫోటో షూట్స్ చేస్తుంటారు. కియరా కూడా తమ ఫాలోవర్స్ ని అసలు డిజప్పాయింట్ చేయకుండా రకరకాల ఫోటో షూట్స్ తో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ బ్లూ కలర్ డ్రెస్ లో కూడా తన తొడల అందాలతో అమ్మడి గ్లామర్ షో అదుర్స్ అనిపించేలా చేస్తుంది.

కళ్లతోనే కైపెక్కించేలా.. చూపుల్తో నిషా ఎక్కించేస్తుంది కియరా. ఆఫ్టర్ మ్యారేజ్ ఏ హీరోయిన్ అయినా కెరీర్ లో కాస్త వెనుక పడుతుంది. కానీ కియరా మాత్రం ముందు కన్నా వేగంగా దూసుకెళ్తుంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అమ్మడు చేస్తున్న సినిమాలు ఆడియన్స్ ని ఖుషి చేస్తున్నాయి. అదనంగా అమ్మడు చేసే గ్లామర్ షో ఆమె గ్రాఫ్ మరింత పెరిగేలా చేస్తున్నాయి. కియరా క్రేజీ ఫోటో షూట్ చూసి కామెంట్స్ పెట్టడమే ఆమె ఫాలోవర్స్ వంతు అయ్యింది.