Begin typing your search above and press return to search.

డైప‌ర్లు మార్చిన న‌టికి 150 కోట్ల ఆస్తులు!

త‌న ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను ఈ బ్యూటీ పెళ్లాడి లైఫ్‌లో సెటిలైంది. పెళ్లి త‌ర్వాతా క‌థానాయిక‌గా ఎలాంటి ఇబ్బందీ లేకుండా కెరీర్ ని కొన‌సాగిస్తోంది

By:  Tupaki Desk   |   23 April 2024 3:06 PM GMT
డైప‌ర్లు మార్చిన న‌టికి 150 కోట్ల ఆస్తులు!
X

'M.S ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన కియ‌రా అద్వాణీ, ఆ త‌ర్వాత 'భ‌ర‌త్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లోను ఆరంగేట్రం చేసింది. ట్యాలెంటెడ్ కియ‌రాకు కెరీర్ ఆరంభ‌మే ల‌క్ క‌లిసొచ్చింది. తొలి రెండు చిత్రాలు గ్రాండ్ స‌క్సెస‌య్యాయి. అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకున్న కియ‌రా కెరీర్ శ‌ర‌వేగంగా టేకాఫ్ అయింది. ఇప్పుడు కోట్ల‌లో పారితోషికాలు డిమాండ్ చేసే క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా ఎదిగింది. కేవ‌లం నాలుగేళ్ల‌లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్‌గా క్రేజ్‌ను అందుకుంది. ఇత‌ర క‌థానాయిక‌ల‌తో పోలిస్తే కియ‌రా ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా బంప‌ర్ హిట్ కొట్టింది. త‌న ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను ఈ బ్యూటీ పెళ్లాడి లైఫ్‌లో సెటిలైంది. పెళ్లి త‌ర్వాతా క‌థానాయిక‌గా ఎలాంటి ఇబ్బందీ లేకుండా కెరీర్ ని కొన‌సాగిస్తోంది.

కియ‌రా సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్‌ని ఆస్వాధిస్తోంది. ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇది కియ‌రాలోని కొత్త కోణాన్ని ఎలివేట్ చేస్తోంది. అందాల కియ‌రా ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ ... ఆఫ్ట‌ర్ మ్యారేజ్ రాయ‌ల్ లైఫ్ స్టైల్ ని ఇది ఎలివేట్ చేస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు.. కియ‌రా కెరీర్ ప్రారంభించి ఇప్ప‌టికే 50 కోట్లు పైగా ఆర్జించ‌గా.. త‌న భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఆస్తుల‌ను క‌లుపుకుని సుమారు 150కోట్లు పైగా నిక‌ర ఆస్తుల‌ను క‌లిగి ఉన్న న‌టిగా పాపుల‌రైంది.

ఇండ‌స్ట్రీలోకి రాక ముందు ఏం చేసేదంటే?

బాలీవుడ్ లోకి రాకముందు తాను డైపర్లు మార్చేదానినని కియారా అద్వానీ స్వ‌యంగా వెల్లడించింది. న‌టి కాక మునుపు కియారా అద్వానీ తన తల్లి గారు నిర్వ‌హించే ప్రీస్కూల్‌లో పనిచేసారు. అప్పుడు పిల్ల‌ల‌కు 'డైపర్లు మార్చడం'లో తనకు అనుభవం వ‌చ్చింద‌ట‌. తాజా ఇంటర్వ్యూలో పిల్లల విష‌యంలో తనకున్న ప్రేమ‌ ఆప్యాయతల‌ గురించి ఈ భామ‌ ఓపెనైంది. ఆశ్చర్యకరంగా త‌న‌ తల్లి గారు నిర్వ‌హిస్తున్న‌ ప్రీ-స్కూల్‌లో ఉద్యోగం చేసింది కియ‌రా. తన నటనా వృత్తిని ప్రారంభించడానికి ముందు శ్రద్ధగా పనిచేసింది. నేను ఉదయం 7 గంటలకు ప్రీస్కూల్ కి వెళ్లి, అక్కడే ఉండి పిల్లలను చూసుకునేదానిని. పిల్లలను మేనేజ్ చేసే విషయంలో నేను అన్నీ చేశాను. నేను నర్సరీ రైమ్‌లు పాడాను. వారిని అక్షరాలు, సంఖ్యలను నేర్చుకునేలా చేసాను. వారి డైపర్‌లను కూడా మార్చాను'' అని కియారా తెలిపారు. పిల్లల సంరక్షణలో తన అనుభవాన్ని కియ‌రా అద్వాణీ హైలైట్ చేసింది.

నేను పిల్లలను ప్రేమిస్తాను.. ఏదో ఒక రోజు నేను బిడ్డను కలిగి ఉండటానికి ఇష్టపడతాను. అది నా జీవితంలో అత్యంత అందమైన అనుభూతి అని నేను భావిస్తున్నాను! అని కియారా భవిష్యత్తులో మాతృత్వాన్ని స్వీకరించాలనే తన ఆకాంక్షను కూడా వెలిబుచ్చింది. వెండితెర‌పై అద్భుత న‌ట‌న‌తోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లో చ‌ల్ల‌ని మ‌న‌సుతోను కియ‌రా ఆక‌ట్టుకుంటోంది. పిల్లల విష‌యంలో త‌న ప్రేమాభిమానాల‌ను అస్స‌లు దాచుకోవలేదు ఈ భామ‌.