Begin typing your search above and press return to search.

సూపర్ హాట్ లుక్ లో కియారా.. నెవ్వర్ బిఫోర్..!

ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో వ్వా అనిపించింది.

By:  Tupaki Desk   |   14 July 2023 3:15 PM GMT
సూపర్ హాట్ లుక్ లో కియారా.. నెవ్వర్ బిఫోర్..!
X

కియారా అద్వాణీ పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా, టాలీవుడ్ జనాలకు పరిచయమే. మహేష్ భరత్ అనే నేను సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంటనే వినయ విధయ రామ లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాల్లో వరసగా ఛాన్సులు దక్కించుకోవడంతో టాలీవుడ్ లో ఇక పాగా వేసినట్లే అని అందరూ అనుకున్నారు.







కానీ, వినయ విధయ రామ ప్లాప్ తో టాలీవుడ్ లో మళ్లీ కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది, ఈ సినిమాపై కియారాతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు.

మూవీకి శంకర్ దర్శకత్వం అనడంతోనే అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ పొలిటికల్ డ్రామా గా ఈ కథ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా పాత్ర ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ కూడా ఎక్కువగా ఉంది.

ఈ సంగి పక్కన పెడితే, బాలీవుడ్ లోనూ కియారా దూసుకుపోతోంది. వరసగా అవకాశాలు అందుకుంటోంది. అక్కడ ఇటీవల కార్తీక్ ఆర్యన్ తో కలిసి సత్య ప్రేమ్ కి కథ లో నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు అక్కడ మరిన్ని సినిమాలు చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, తాను షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ అంతే చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో వ్వా అనిపించింది.

ఈ ఫోటోల్లో ఆమె సూపర్ హాట్ గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కియారా చాలా సార్లు గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంది. కానీ, ఈ ఫోటో మాత్రం నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఉంది. నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ లా అనిపించడం విశేషం. ఈ హాట్ నెస్ తట్టుకోవడం మా వళ్ల కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం ఆమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంపాటు ప్రేమించుకున్నారు. ఇటీవల కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తల్లి కాబోతోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై స్పందించకుండానే, తన ఫోటోలతో ఆ వార్తలు అబద్దం అంటూ ప్రూవ్ చేసింది.