Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో బాలీవుడ్ బ్యూటీ.. ఇది అసలు మ్యాటర్!

కీయరా అద్వానీ అయితే సలార్ 2 సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించడం లేదని సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 7:54 AM GMT
ప్రభాస్ తో బాలీవుడ్ బ్యూటీ.. ఇది అసలు మ్యాటర్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలి అని చాలామంది బ్యూటీలు ఎదురుచూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా వరల్డ్ వైడ్ గా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటూ ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈజీగా 500 కోట్ల మార్కెట్ తో దూసుకుపోతున్న ఈ రెబల్ స్టార్ రాబోయే రోజుల్లో మళ్ళీ 1000 కోట్ల మార్కెట్ ను టచ్ చేస్తాడు అని చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం ఆ రెంజ్ లో అయితే క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో పాటు రాజా సాబ్ సినిమాను కూడా ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కల్కి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా రాజా సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక నెక్స్ట్ హను రాగవపూడి తో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

దానికి ఇప్పటికే స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమాపై కూడా కీలకమైన అప్డేట్ అయితే రాబోతోంది. ఇక సలార్ 2 సినిమా కూడా నెక్స్ట్ పట్టాలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక సీక్వెల్ అయితే అంతకుమించి అనేలా ఉంటుంది అని మేకర్స్ గట్టిగానే అంచనాలు పెంచేస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేసేసాడు. అయితే సెకండ్ పార్ట్ లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా మరొక కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి.

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్ లో మాత్రం కియార అద్వానీని హైలైట్ చేస్తూ ఆమెతో ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా గాసిప్స్ అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇక ఈ విషయంలో మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

కీయరా అద్వానీ అయితే సలార్ 2 సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించడం లేదని సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ అందులో కీయరా ఉంటుందా లేదా అనేది విషయంలో కూడా ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదని సమాచారం.