Begin typing your search above and press return to search.

షారుఖ్ అభిమానులకి కియరా సర్‌ప్రైజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీయరా అద్వానీ గెస్ట్ రోల్ చేయనుందంట. ఓ సాంగ్ లో ఆమె కొద్ది సేపు కనిపించబోతోందని తెలుస్తోంది

By:  Tupaki Desk   |   14 July 2023 12:56 PM GMT
షారుఖ్ అభిమానులకి కియరా సర్‌ప్రైజ్
X

బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అత్లీ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాని అత్లీ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇంటరెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో జవాన్ టీజర్ ని అత్లీ ఆవిష్కరించారు. దేశ వ్యాప్తంగా ఈ టీజర్ వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో జవాన్ మూవీ రిలీజ్ కానుంది. దానికి తగ్గట్లుగానే గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి అత్లీ ప్లాన్ చేస్తున్నారు.

పఠాన్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు.

అలాగే కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నారు. పఠాన్ మూవీ ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ అందుకుంది. ఇప్పుడు జవాన్ సినిమాతో అంతకుమించి కలెక్షన్స్ ని అందుకోవాలని షారుఖ్ ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే సినిమాని హైలెవల్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీయరా అద్వానీ గెస్ట్ రోల్ చేయనుందంట. ఓ సాంగ్ లో ఆమె కొద్ది సేపు కనిపించబోతోందని తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించి ఓ ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సాంగ్ ని ముంబైలో ఓ స్టూడియోని చిత్రీకరిస్తున్నారంట.

సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవల్ లో అత్లీ ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన ఇమేజ్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. మరి జవాన్ మూవీ షారుఖ్ ఖాన్, అలాగే అత్లీకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.