Begin typing your search above and press return to search.

కుమార్తెను దాచేస్తున్న కియ‌రా అద్వాణీ

ఇప్పుడు కియారా - సిద్ధార్థ్ జంట‌ గురువారం నాడు శుభ‌వార్త‌ను చెప్ప‌డ‌మే కాక‌, ఫోటోగ్రాఫ‌ర్ల‌కు స్వీట్లు పంపిణీ చేశారు.

By:  Tupaki Desk   |   18 July 2025 9:33 AM IST
కుమార్తెను దాచేస్తున్న కియ‌రా అద్వాణీ
X

అప్పుడే పుట్టిన బిడ్డ‌పై ఫోటో ఫ్లాష్‌లు అంత మంచిది కాదు. ప‌సిగుడ్డు క‌నుపాప‌లు తెర‌వ‌క ముందే క‌ళ్ల‌కు హాని క‌లుగుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. కార‌ణం ఏదైనా కానీ, ఇవేవీ ప‌ట్టించుకునే మూడ్ లో సెల‌బ్రిటీ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు ఉండ‌రు. ఎవ‌రైనా క‌థానాయిక లేదా న‌టీమ‌ణి త‌మ బిడ్డ‌ను ప‌బ్లిక్ కి చూపించ‌కుండా దాచాల‌నుకున్నా, దానిని ఓపెన్ చేసేందుకు వెన‌కాడ‌రు. అయితే కొన్నిసార్లు ఫోటోగ్రాఫ‌ర్లు హ‌ద్దుమీరి ప్ర‌వ‌ర్తించ‌డంపై చాలా ఫిర్యాదులున్నాయి.

పాపుల‌ర్ సెల‌బ్రిటీ పేరెంట్ అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనే - రణవీర్ సింగ్, ఆలియా- ర‌ణబీర్, రాణి ముఖర్జీ- ఆదిత్య చోప్రా కూడా ఫోటోగ్రాఫ‌ర్ల కార‌ణంగా త‌మ కిడ్స్ ఇబ్బంది ప‌డ‌టాన్ని అనుమ‌తించ‌లేదు. వారంతా పిల్ల‌ల‌కు గోప్య‌త‌ను కోరుకున్నారు. అన‌వ‌స‌ర ఫోటో సెష‌న్ల‌ను అనుమితించ‌లేదు. అలియా భట్ -రణబీర్ కపూర్ కూడా 2023లో తమ కుమార్తె రహా కపూర్‌తో బహిరంగంగా క‌నిపించిన‌ప్పుడు ఫోటోగ్రాఫ‌ర్ల‌ను అనుమతించ‌లేదు. నో ఫోటోగ్రాఫ్ నియ‌మాన్ని అనుస‌రించారు. బిపాషా బసు, నేహా ధూపియా కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు.

ఇప్పుడు కియారా - సిద్ధార్థ్ జంట‌ గురువారం నాడు శుభ‌వార్త‌ను చెప్ప‌డ‌మే కాక‌, ఫోటోగ్రాఫ‌ర్ల‌కు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ జంట‌కు ఒక అంద‌మైన‌ కుమార్తె జ‌న్మించింది. ఈ ఆనందంలో స్వీట్లు పంచిన జంట ప‌సిపాప ఫోటోగ్రాఫ్స్ తీయొద్ద‌ని స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌ను అభ్యర్థించారు.

శుభ‌వార్త వెలువ‌డ‌గానే, బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు కియ‌రా- సిధ్ జంటను అభినందించారు. అలియా భట్, జాన్వీ కపూర్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, రిచా చద్దా, ప్రీతి జింటా, తమన్నా భాటియా, మహీప్ కపూర్, భావన పాండే, పరిణీతి చోప్రా, భూమి పెడ్నేకర్, మనీష్ మల్హోత్రా త‌దిత‌రులు ఉన్నారు.