కియారా బికినీ.. ఇంత మోసమా?
‘వార్ 2’ సినిమా టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.
By: Tupaki Desk | 21 May 2025 10:57 PM IST‘వార్ 2’ సినిమా టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానులను ఆకర్షించింది. కానీ, టీజర్ వచ్చాక రొటీన్‌గా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి, అలాగే అందరి దృష్టి కియారా అద్వాని బికినీ లుక్‌పై పడింది.
కియారా ఈ సినిమాలో తొలిసారి నెవ్వర్ బిఫోర్ అనేలా చిన్న బికినీ లుక్‌లో కనిపించింది, ఇది ఆమెకు యష్ రాజ్ ఫిల్మ్స్‌తో తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. టీజర్‌లో 3 సెకన్ల బ్లింక్ అండ్ మిస్ సీన్‌లో కియారా నియాన్ గ్రీన్ బికినీలో అద్భుతంగా కనిపించింది. హృతిక్ రోషన్‌తో రొమాంటిక్ సీన్‌లోనూ ఆమె అందం అందరినీ ఆకర్షించింది. కానీ, ఈ సీన్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, కొందరు నెటిజన్లు ఈ లుక్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కియారా బికినీ షాట్‌ను జూమ్ చేసి చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ఫిజిక్ సహజంగా కాకుండా కృత్రిమంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టెక్నాలజీ AIతో మోసం చేశారా అంటూ కుర్రాళ్లు సోషల్ మీడియాలో తెగ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. రెడ్డిట్, ఎక్స్‌లలో “ఇది AI జనరేటెడ్ బాడీ కావచ్చు” అంటూ చర్చలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో కొందరు కియారా బికినీ లుక్‌ను ‘పఠాన్’ సినిమాలో దీపికా పదుకొణె బికినీ సీన్‌తో పోలుస్తున్నారు. “కియారా లుక్ దీపికా కంటే బెటర్‌గా ఉంది” అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు “ఇది AI ఎఫెక్ట్ లాగా ఉంది” అని అంటున్నారు. ఈ వివాదం సినిమా హైప్‌ను మరింత పెంచింది, కానీ ఈ సీన్‌ల వెనుక నిజం ఏమిటనేది సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలియనుంది.
‘వార్ 2’ సినిమా టీజర్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అందరినీ ఆకర్షించాయి. హృతిక్ మరోసారి కబీర్ పాత్రలో, ఎన్టీఆర్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు బాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. ఈ సినిమా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. మొత్తంగా, కియారా బికినీ లుక్ ‘వార్ 2’ టీజర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. AI వాడారా లేదా అనేది పక్కనపెడితే, ఈ సీన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి
