కియారా బికినీ విషయంలోనే ఎందుకు వివాదం..!
వార్ 2 సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సినిమాలో కియారా అద్వానీ వేసుకున్న బికినీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Ramesh Palla | 5 Aug 2025 2:00 PM ISTహృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2' విడుదలకు సిద్ధం అయింది. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న వార్ 2 లో హృతిక్ రోషన్‌కి జోడీగా కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. కియారా అద్వానీ ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేక పోతుంది. కియారా అద్వానీ గర్భతి కావడంతో ప్రమోషన్స్‌కి దూరంగా ఉంది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ విశ్రాంతిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో నెల లేదా రెండు నెలల తర్వాత విడుదల ఉండి ఉంటే ఖచ్చితంగా కియారా అద్వానీని ప్రమోషన్స్‌లో చూసే అవకాశం ఉండేది అనేది బాలీవుడ్ వర్గాల టాక్. వార్ 2 సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సినిమాలో కియారా అద్వానీ వేసుకున్న బికినీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్ 2 లో కియారా బికినీ లుక్ వైరల్
కియారా అద్వానీ బికినీ ఫోటోలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఏ హీరోయిన్ బికినీలో ఇంత అందంగా కనిపించలేదు అంటూ కియారా అద్వానీ అభిమానులు చాలా మంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన గత చిత్రాల్లోనూ అందాల ఆరబోత చేసింది. కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపించింది. ఈ అందంకు కారణం సీజీ వర్క్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మరో రకంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి వార్ 2 సినిమాలోని కియారా అద్వానీ యొక్క లుక్‌ను చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేయడం, ట్రోల్స్ చేయడం జరుగుతుంది. బాలీవుడ్‌లో ఈ జాడ్యం చాలా కాలంగా కొనసాగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కియారా అద్వానీ
ఒక హీరోయిన్ గురించి మరో హీరోయిన్ యొక్క అభిమానులు లేదా పీఆర్ టీం ట్రోల్స్ చేయడం, సోషల్ మీడియా ద్వారా నెగటివ్ ప్రచారం చేయడం అనేది కామన్‌గా జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో కియారా అద్వానీ గురించి ఎప్పుడూ ఏదో ఒక పుకారు లేదా నెగటివ్ ప్రచారం ఉంటుంది. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి కష్టపడి స్టార్డం దక్కించుకుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇండస్ట్రీలో నెపో కిడ్‌గా అడుగు పెట్టినప్పటికీ ఆమెకు ఉన్న ప్రతిభ కారణంగా తక్కువ సమయంలోనే సొంతగానే స్టార్‌డం దక్కించుకుంది. మంచి అందంతో పాటు, నటన ప్రతిభ కారణంగా కియారా అద్వానీకి బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన, పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయి.
ఎప్పుడు విమర్శలు
ఆ సమయంలోనే ఆమెను కొందరు పనిగట్టుకుని విమర్శించడం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె యొక్క పాత్రలను ఎప్పటికప్పుడు విమర్శించడం చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ ఎన్నో సినిమాల్లో బికినీతో కనిపించారు. కానీ కియారా అద్వానీ మాత్రం ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపించడం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. కియారా అద్వానీపై వస్తున్న ట్రోల్స్‌కు ప్రధాన కారణం ఆమెపై ఇతర హీరోయిన్స్ లో ఉన్న అసూయ అయ్యి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటి అనేది మాత్రం ఏ ఒక్కరూ బయటకు చెప్పడం లేదు. కియారా అద్వానీ ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు సాగుతుంది. ఆమె ఇండస్ట్రీలో ముందు ముందు స్టార్ స్టేటస్‌ను దక్కించుకోవడం ఖాయం. వార్ 2 పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి కొత్త కెరీర్‌ను పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
