కియరా అద్వాణీకి 'మామ్'గా ప్రమోషన్
తనదైన అందం రూపలావణ్యంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కియరా అద్వానీ ఇప్పుడు ఒక బిడ్డకు 'మామ్' అయింది.
By: Tupaki Desk | 16 July 2025 10:12 AM ISTతనదైన అందం రూపలావణ్యంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కియరా అద్వానీ ఇప్పుడు ఒక బిడ్డకు 'మామ్' అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం సాయంత్రం గుర్గావ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ (రిలయన్స్ ఫౌండేషన్) ఆసుపత్రిలో తమ మొదటి బిడ్డ (ఆడ శిశువు)ను స్వాగతించినట్లు సమాచారం. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసింది.
ఇంకా కియరా, సిధ్ నుంచి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినా సన్నిహితుల ద్వారా సమాచారం అందింది. సిద్ధార్థ్ తల్లి రిమ్మా మల్హోత్రా, కియారా తల్లిదండ్రులు జెనీవీవ్ -జగదీప్ అద్వానీ సహా పలువురు కియరాను పరామర్శించేందుకు ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రికి బయల్దేరారని తెలిసింది.
2021లో షేర్షా చిత్రంలో కియరా- సిద్ధార్థ్ జంటగా నటించారు. అంతకుముందు కొన్నేళ్లుగా ఈ జోడీ ప్రేమలో ఉన్నారు. చివరకు ఫిబ్రవరి 2023లో రాజస్థాన్‌లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో గర్భధారణ గురించి కియరా వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన మెట్ గాలాలో కియారా తన బేబీ బంప్‌ను కూడా ప్రదర్శించింది. ఇప్పుడు ఒక బిడ్డకు మామ్ గా ప్రమోటైంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2లో కియరా ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది.
