అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన కియారా..
ఈమధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. పలు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. పలు విషయాలను అభిమానులతో పంచుకుంటోంది
By: Madhu Reddy | 24 Dec 2025 6:00 PM ISTప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. పలు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. పలు విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈమె ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలకు.. పెరిగిపోతున్న అనుమానాలకు తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది కియారా అద్వానీ.
ఈ ఏడాది తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు.. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఈమె బికినీ ధరించింది. అదే సమయంలో ప్రెగ్నెంట్ కూడా.. దీంతో ఈమె బికినీ సన్నివేశాల కోసం ఏఐ ఉపయోగించారంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీనిపై కూడా ఆమె స్పందించింది.
అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా అద్వానీ మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు గర్భం దాల్చాను? ఎలా షూటింగ్స్ మేనేజ్ చేశాను? అని చాలామంది అనుమానపడ్డారు. అయితే నేను గర్భం దాల్చిన ఏడో నెల వరకు కూడా షూటింగ్స్ లో పాల్గొన్నాను. అయితే నేను గర్భం దాల్చానన్న విషయం కేవలం దర్శకుడు, నిర్మాతకు మాత్రమే తెలుసు. అంతలా జాగ్రత్తలు తీసుకొని నటించాను. ముఖ్యంగా షాట్ ముగిసిన ప్రతిసారి కారవాన్ లోకి వెళ్లి నా బిడ్డతో మాట్లాడేదాన్ని. కేవలం నటిస్తున్నాను.. భయపడకు అంటూ నా కడుపులో ఉన్న బిడ్డకు భరోసా ఇచ్చేదాన్ని..
అటు గర్భం దాల్చినపుడు ఏడు నెలల వరకు షూటింగ్స్ లో పాల్గొన్నాను. అలా పాల్గొన్న ప్రతిసారి చిత్ర బృందం నాకు ఎంతో సహాయపడింది" అంటూ తెలిపింది. అలాగే వార్ 2లో బికినీ సన్నివేశంపై వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ.. "దీనిని చాలామంది ఏఐ అనుకున్నారు. కానీ బికినీ ఫిజిక్ కోసం కఠోరమైన క్రమశిక్షణ కూడా పాటించాను.."అంటూ తెలిపింది. మొత్తానికైతే ఇన్ని రోజులు తన గర్భం గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది కియారా అద్వానీ
కియారా అద్వానీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో నదియా అనే పాత్రలో నటిస్తున్నట్టు పాత్రను రివీల్ చేస్తూ.. ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. యశ్ హీరోగా వస్తున్న ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కరీనాకపూర్, శృతిహాసన్, నయనతార తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో కియారాను కన్ఫర్మ్ చేయగా.. మిగిలిన ముగ్గురిలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం త్వరలోనే వెల్లడించనున్నారు.
