కియారాలో మార్పు కొత్త ఏడాది నుంచి అమలు!
బాలీవుడ్ నటి కియారా అద్వాణీకి 2025 ఏడాది కలిసొచ్చిందా? అంటే వ్యక్తిగతంగా కలిసొచ్చిందనాలి. కానీ వృత్తిగతంగా ఎంత మాత్రం కలిసి రాలేదన్నది అంతే వాస్తవం.
By: Srikanth Kontham | 28 Dec 2025 2:00 PM ISTబాలీవుడ్ నటి కియారా అద్వాణీకి 2025 ఏడాది కలిసొచ్చిందా? అంటే వ్యక్తిగతంగా కలిసొచ్చిందనాలి. కానీ వృత్తిగతంగా ఎంత మాత్రం కలిసి రాలేదన్నది అంతే వాస్తవం. ఈ ఏడాది ఆరంభంలోనే కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అమ్మగా ప్రమోషన్ అందుకుంది. ప్రతీ మహిళ కనే ఓ అద్భుతమైన కలను ఈ ఏడాది సాధ్యం చేసుకుంది. ఆ రకంగా కియారా ఎంతో లక్కీ ఉమెన్. ప్రస్తుతం గర్బం దాల్చడం, పిల్లలు జన్మించడం అన్నది ఎంత కష్టంగా మారిందో తెలిసిందే. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కొన్ని రకాలు బాండింగ్స్ ను కూడా కోల్పోవాల్సిన రోజుల్లో ఉంది సోసైటీ.
పెరిగిన రేడియేషన్ ప్రభావం మహిళలపై ఎంతగానో ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి ఎన్నో సమస్యల్ని నేటి జనరేషన్ మహిళలు ఎదుర్కుంటున్నారు. అలా చూస్తే కియారా అద్వాణీ ఎంత అదృష్టవంతురాలు అని చెప్పొచ్చు. ఆ రకంగా 2025 మాత్రం ఎంతో కలిసొచ్చింది. కానీ ప్రోపెషనల్ గా మాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రిలీజ్ అయినా పాన్ ఇండియా సినిమా `గేమ్ ఛేంజర్` డిజాస్టర్ అయింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన రెండవ చిత్రమిది. ఇదైనా హిట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ పనవ్వలేదు.
అనంతరం రిలీజ్ అయిన `వార్ 2` తోనైనా భారీ విజయం అందుకుంటుందని భావించారు. కానీ అది జరగలేదు. బాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా డిజాస్టర్ ఖాతాలోనే పడింది. దీంతో కియారా అద్వాణీ ప్రోఫెషనల్ గా కొన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది. వాటిని వచ్చే ఏడాది నుంచి అమలు పరచాలని సిద్దమవుతోంది. ఏంటా మార్పులు అంటే? స్టోరీల పరంగా ఇన్నోవేటివ్ గా ఉండటం...పాత్రల పరంగా యూనిక్ గా ఉండటం వంటిది ప్రధానంగా చేసిన మార్పుగా తెలుస్తోంది. ఇకపై తాను ఏ సినిమా కమిట్ అయినా? అన్ని రకాలుగా ఆలోచించే ఒకే చెబుతానంది.
పాత్రల విషయంలో మరింత పరిణతితో వ్యవహరించాలంది. వేగంగా సినిమాలు చేయడం మానేసి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు కొన్ని చేసినా మంచి ఫలితాలు సాధించొచ్చు అంటోంది. అలాగే ప్రచార క్యార్యక్రమాలు కూడా మునుపటిలా వేగంగా చేయనంటోంది. తొలి ప్రాధాన్యత తన ఉనికి, స్పష్టతకే ఇస్తానంది. కొన్ని లక్ష్యాలు ..కొత్త ఆలోచనలతో ముందుకెళ్తానంది. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నది అమ్మడి అంతిమ లక్ష్యంగా పేర్కొంది.
