కియారా బికినీ అందం సీజీ కాదు, నికోల్ క్లారిటీ
అదే సమయంలో చాలా మంది కియారా బికినీ అందంపై విమర్శలు చేస్తూ ఉంటే, మరికొందరు సీజీ అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
By: Ramesh Palla | 4 Aug 2025 11:37 AM ISTహృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన వార్ 2 సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా కియారా అద్వానీ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. చాలా సినిమాల్లో అందాల ఆరబోత చేసింది. బికినీ కూడా ధరించింది. కానీ వార్ 2 కోసం కియారా అద్వానీ ధరించిన బికినీ బాగా పాపులర్ అయింది. కియారా అద్వానీ బికినీ లుక్‌కి మొత్తం సోషల్ మీడియా ప్రపంచం షేక్ అయిన విషయం తెల్సిందే. అదే సమయంలో చాలా మంది కియారా బికినీ అందంపై విమర్శలు చేస్తూ ఉంటే, మరికొందరు సీజీ అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
కియారా బికినీ అందంపై ట్రోల్స్
కియారా అద్వానీ బికినీ ఫోటోలను దీపికా పదుకునే బికినీ ఫోటోలతో కంపైర్ చేస్తూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు. దీపికా పదుకునే అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు కియారా అద్వానీ బికినీ ఫోటోలను విమర్శించడం ఆ మధ్య జరిగింది. ముఖ్యంగా కియారా అద్వానీ బికినీ ఫోటోలు గ్రాఫిక్స్ అంటూ చాలా మంది కామెంట్స్ చేయడం, కొన్ని సాక్ష్యాలు ఇదుగో అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం, మార్ఫింగ్ షోటోలు షేర్ చేయడం చేశారు. కానీ ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా కూడా కియారా బికినీ బ్యూటీకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆమె బికినీ ట్రీట్ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని మేకర్స్‌తో పాటు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కియారా తీసుకునే ఆహారం ఇదే
తాజాగా కియారా అద్వానీ బికినీ ఫోటోలపై వస్తున్న విమర్శలకు నికోల్ లిన్‌హారెస్ కేడియా స్పందించారు. వీరు కియారా అద్వానీ యొక్క డైట్ ను చూస్తూ ఉంటారు. కియారాకు మాత్రమే కాకుండా ఎంతో మందికి డైట్ సలహాలు సూచనలు వీరు ఇవ్వడం జరుగుతుంది. కియారా ఫిట్ నెస్ గురించి వారు మాట్లాడుతూ.. ఆమె తిన్న భోజనం చాలా జాగ్రత్తగా తయారు చేయబడింది. ఆహారంలో వాడిన నూనె నుంచి చీజ్ వరకు ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని కుక్ చేయించాం. టిఫిక్‌లో ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఓట్స్ మరియు వాల్‌నట్స్ ను వాడటం జరిగింది. సహయంగా ఉండే పలు ఆహార పదార్థాలను ఆమెకు అందించడం ద్వారా ఫిజిక్ చాలా స్టిఫ్‌గా ఉంటుందని అన్నారు.
ఆగస్ట్ 14న భారీ ఎత్తున వార్ 2 రిలీజ్
లంచ్ టైమ్‌లోనూ ఆమె అత్యంత జాగ్రత్తలు తీసుకుని మరీ తినడం జరిగింది. వర్కౌట్స్‌తో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్లే అలాంటి ఫిజిక్ దక్కుతుందన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారంకు, సీజీ బికినీ ఫోటోలు, వీడియోలు అంటూ చేస్తున్న ట్రోల్స్‌కి తెర పడ్డట్లు అయింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడం వల్లే కియారా బికినీ లో అంత అందంగా ఉంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. వార్ 2 సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. గర్భవతి కావడం వల్ల కియారా అద్వానీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
